ఎల్లోమీడియా కూడా చివరకు రివర్స్ గేరులో వెళుతోంది. ఇంతకాలం చంద్రబాబునాయుడే రివర్స్ గేరులో వెళ్ళేవారు. అలాంటిది ఇపుడు 24 గంటలూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడే ఎల్లోమీడియా కూడా రివర్స్ గేరు మొదలుపెట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిగా విశాఖపట్నం పనికిరాదంటూ జీఎన్ రావు కమిటి చెప్పిందంటూ బుధవారం ఎల్లోమీడియా ప్రముఖంగా కథనాలు అందించింది. విశాఖపట్నాన్ని రాజధానిగా ఎందుకు వద్దని కమిటి చెప్పిందో ఉదాహరణలతో సహా కొన్ని చెత్త రాతలు రాశారు.

 

సీన్ కట్ చేస్తే బుధవారం సాయంత్రానికి జీఎన్ రావు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నమే రాజధానిగా బెస్ట్ సిటి అని తాము సూచించిన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాకపోతే విశాఖ నగరంలో ఉన్న కొన్ని సమస్యలను తమ కమిటి ప్రస్తావించిందే కానీ రాజధానిగా వద్దని చెప్పలేదని క్లారిటి ఇచ్చారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటేమో ఇదే నివేదికపై ఎల్లోమీడియా చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు నోటికొచ్చినట్లు చేసిన కామెంట్లను, తిట్లను ప్రముఖంగా హైలైట్ చేసింది.

 

టిడిపి వాయిస్ వినిపించటమే కాకుండా తాము కూడా కమిటి నివేదికను తప్పుపడుతూ సొంతంగా కథనాలు కూడా అచ్చేసింది. చాలా చాట్లో కమిటి నివేదికలను టిడిపి నేతలు+స్ధానికులు తగులబెట్టిన ఘటనలను  ప్రముఖంగా ప్రసారాలు చేసింది. అయితే తెరవెనుక ఏమయ్యిందో ఏమో ఓ పదిహేను రోజుల తర్వాత రెండు పత్రికలు మొదటిపేజీలో జిఎన్ రావు కమిటి రిపోర్టును ప్రముఖంగా కథనాలు అచ్చేశాయి. విశాఖను రాజధానిగా వద్దంటూ కమిటి సూచించిందంటూ తప్పుడు వార్తలు ఒకేసారి ప్రచురించటం గమనార్హం.

 

దాంతో జీఎన్ రావు స్పందిస్తు ఎల్లోమీడియా కథనాలు తప్పని స్పష్టంగా ఖండించటంతో  ఏమి చేయాలో దిక్కు తోచలేదు.  అందుకనే తాము రాసిన తప్పుడు కథనాలే నిజమని జనాలను నమ్మించటానికి నానా అవస్తలు పడుతోంది.  అందుకనే కమిటి తన పరిధిని దాటిందని అడగని దాన్ని కూడా చెప్పిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అదే సందర్భంగా  తాను అనుకున్న విషయాలనే కమిటికి చెప్పి ఎవరో రాయించారంటూ మరో చెత్త పాయింట్లను ఫోకస్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: