దేశ రక్షణ విభాగంలో నేవీకి చాలా ప్రాధాన్యత ఉన్నది.  నేవి కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నది.  తీర భాగం మొత్తం నేవి చేతుల్లోనే ఉంటుంది.  అధికారులు అక్కడి నుంచి దేశాన్ని కాపాడుతుంటారు.  బోర్డర్ లో ఎంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ శత్రువులు సముద్రం గుండా ఎటాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.  అందుకే దేశ రక్షణకు నేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.  ఇలాంటి నేవి ఇప్పుడు ఇరకాటంలో పడింది.  నేవి అధికారులు కొందరు డబ్బుల కోసం, అమ్మాయిల పొందుకోసం తప్పుడు మార్గంలో పయనిస్తూ... దేశరక్షణకు చెందిన కొన్ని రహస్యాలను దేశం సరిహద్దులు దాటించి శత్రుదేశాలను చేరవేశారు.  


ఇలా చేరవేసిన వాళ్లలో 11 మందిని ఎన్ఐఏ విభాగం అరెస్ట్ చేసింది.  హవాలా సొమ్మును నేవి అధికారుల ఖాతాల్లోకి చేరుస్తున్న వ్యక్తులను కూడా పట్టుకున్నారు.  వీరిని ఇటీవలే అరెస్ట్ చేశారు.  ముంబై కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ పని చేస్తున్నారు.  11 మంది నేవీ అధికారుల నుంచి ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.  డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని అదుపులోకి తీసుకొని ఇంకా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  


కాగా, చేతిరాతతో కూడిన కొన్ని పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  వీటిని ఫోర్స్ నిక్ ల్యాబ్ కు పంపి పరీక్ష చేయిస్తున్నారు.  ఇలా ఎన్నో రకాలుగా దారుణాలకు ఒడిగట్టిన అధికారులను అదుపులోకి తీసుకోవడంతో దేశం షాక్ అయ్యింది.  ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్న వ్యక్తులంతా కూడా 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వ్యక్తులే కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.  ఎలాగైనా మిగతా వాళ్ళను కూడా పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  


కేవలం 11 మంది మాత్రమే ఉన్నారా లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తున్నారు.  ఇప్పటికే నేవీ అధికారులకు సంబంధించి సోషల్ మీడియాను కట్ చేశారు.  బ్రౌజింగ్ ను కూడా నిలిపివేశారు.  నేవీ అధికారులు స్మార్ట్ ఫోన్స్ వాడకూడదని నిషేధం విధించారు.  ఇన్ని నిషేధం విధించినా 11 మంది దొరకడంతో అధికారులు షాక్ అవుతున్నారు.  డబ్బు, అమ్మాయిలకు ఇలా లొంగిపోతే దేశం భవిష్యత్తు ఎలా మారిపోతుందో తలచుకుంటే భయం వేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: