ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను  పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర బడ్జెట్ వైపు ఎంతో ఆశగా చూస్తున్నాయి. తమ తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారు అనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం... రోజురోజుకు వృద్ధిరేటు తగ్గిపోతున్న ఆయా రంగాలకు ఎలా ఆదుకో బోతుంది  అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 

 

 ఇకపోతే దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు జీడీపీలో మూడుకు చేరింది. ఇది మొన్న బడ్జెట్ లో  చూపిన దాని కంటే తక్కువే. ఇలా రోజురోజుకు ప్రభుత్వాల ద్రవ్యలోటు తగ్గిపోతూ వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకుల్లో అప్పు  పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వా లన్ని కేంద్ర బడ్జెట్ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో.. ప్రజల వ్యక్తిగత పొదుపు కూడా తగ్గుతుంది. వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో  ఎవరు డిపాజిట్ చేయడం లేదు. ఈ కారణంగా బ్యాంకులకు నగదు ఎక్కువ మొత్తంలో చేరడం లేదు. 

 

 

 ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వనరుల సమీకరణ కోసం భారతీయ కార్పొరేట్ సంస్థలు... విదేశీ మార్కెట్కు వెళ్లాల్సిన ఆగత్యం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను ఆదుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటును తగ్గించేందుకు కేంద్ర బడ్జెట్లో... ఎంత మేరకు న్యాయం చేసి ఆదుకుంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: