భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఉంటే లేని మనిషి ఉన్నట్లు...  సృష్టించవచ్చు ఉన్న మనిషిని  లేడు అని కూడా సృష్టించవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు కూడా. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అన్న ఆధార్ కార్డు ఉండాలి.. ఏదైనా లోన్ కి అప్లై చేసుకోవాలి అన్నా ఆధార్ కార్డు ఉండాలి... చివరికి ఒక మొబైల్ సిమ్ తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. 

 

 

 అయితే ఎక్కడికి వెళ్లినా ప్రజలను అధికారులు ఆధార్ కార్డు  అడగడం కామన్. మరి దేవునికి ఆధార్ కార్డు ఉంటుందా. దేవునికి ఆధార్ కార్డు ఉండడం ఏంటి అంటారా... ఇక్కడ అధికారులు మాత్రం దేవుని ఆధార్ కార్డు చూపించాలి అంటూ అడిగారు. దీంతో రైతులు షాక్  కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవునికి ఆధార్ కార్డు ఏంటి అని రైతులు అధికారులను ప్రశ్నించిప్పటికీ... ఆధార్ కార్డు ఉంటేనే  పంట రుణాలు ఇస్తామంటూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు. 

 

 ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దేవాలయాల భూములను సాగు చేసే కౌలు రైతుల పంట రుణాల కోసం రైతులు బ్యాంకుల కి వెళ్తే... అధికారులు వింత షరతులు పెడుతున్నారు. దేవుడి యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలని దేవుడికి ఎలాంటి అప్పులు లేవని పత్రాలను సమర్పించాల్సి అని బ్యాంకు అధికారులు అడుగుతున్నారు అంటూ రాష్ట్ర కౌలు రైతుల సంఘం పేర్కొంది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్కు కౌలు రైతుల సంఘం ఫిర్యాదు చేసింది. రైతులందరికీ వెంటనే కౌలు రశీదు ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది రాష్ట్ర కౌలు రైతు సంఘం.

మరింత సమాచారం తెలుసుకోండి: