ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగం. ఎన్ని ప్రణాళికలు రచిస్తున్న, ఉపాధి అవకాశాలంటూ ప్రకటనలు ప్రభుత్వాలు గుప్పిస్తున్న ఈ సమస్య తగ్గడం లేదు. ఇదే కాకుండా మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు అట్టహాసంగా ప్రవేశపెట్టిన నిరుద్యోగాన్ని తగ్గించడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

 

 

ఇదే కాకుండా ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు, చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తు, భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతుందని చెబుతున్నాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు! ఇదే కాకుండా సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. 2017లో మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా 2018లో అది 1.86 కోట్లకు చేరుకోగా, 2019నాటికి ఇది ఇంకా పెరిగి దాదాపుగా 1.89 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసారు.

 

 

అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ నిరుద్యోగం పెద్ద సమస్యలా తయారైంది. ఇదే కాకుండా 2016 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయినట్టు గుర్తించారు. ఇక స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 నివేదిక ప్రకారం.. దేశంలో నిరుద్యోగ సమస్య 2011 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని చెబుతోంది. 2018 ఏడాదిలో నిరుద్యోగ రేటు 6 శాతానికి పెరిగిపోయింది. 2000 నుంచి 2011 మధ్య కాలంలో కంటే రెండింతలు పెరిగినట్టు తెలిపింది. కంజ్యూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ద సెంటర్ డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. గత జనవరిలోనే లీకైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా ఇండియాలో నిరుద్యోగం రేటు 45 ఏళ్లలో 2017 -18లో అత్యధికంగా 6.1 శాతం రికార్డు అయినట్టు తెలిపింది.

 

 

అంతే కాకుండా ఉన్నత విద్య చదివిన 20 నుంచి 24 ఏళ్ల వయసు కలిగిన వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇకపోతే  పట్టణ ప్రాంతాల నిరుద్యోగం జాతీయ సగటుకంటే ఎక్కువగానే ఉంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(ముంబయి) ప్రకారం... 2019 తొలి త్రైమాసికంలో 6.65% ఉన్న నిరుద్యోగం నాలుగో త్రైమాసికానికి వచ్చేసరికి 7.7 శాతానికి పెరిగింది. కేంద్రం 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం విడుదల చేసిన లెక్కల ప్రకారం 6.1%గా నమోదైంది. కాగా కనీసం ఈ బడ్జెట్ సమావేశంలో అయినా నిర్మలా సీతారామన్‌ కనికరించి ఆశించిన ఫలితాలను అందిస్తుందనే ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఏ విధమైన అవకాశాలను అందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: