శాసనమండలి రద్దుకు వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ ఓ షాడో పార్టీని ఏర్పాటు చేస్తోందా ? మండలి రద్దును చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి ఎంఎల్సీలు, నేతలంతా తీవ్రంగా వ్యతరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మండలిలో మెజారిటి ఉందన్న కారణంగా బిల్లుల చర్చ సందర్భంగా ఎంత కంపు చేయాలో అంతా చేశారు చంద్రబాబు. దాంతో ఒళ్ళుమండిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా మండలినే రద్దు చేస్తు అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపేశారు.

 

మండలి రద్దుకు ఎప్పుడైతే అసెంబ్లీ తీర్మానం పాస్ చేసిందో సీన్ వెంటనే కేంద్రానికి మారిపోయింది. ఎందుకంటే తీర్మానం అయిపోయిన అదేరోజు రాత్రి ప్రభుత్వం తర్వాత చర్యల కోసం బిల్లును కేంద్రానికి పంపేసింది. తీర్మానం ఆమోదం పొంది మండలి రద్దు అవ్వాలంటే కనీసం మూడేళ్ళు పడుతుందని చంద్రబాబు, యనమల అండ్ కో పదే పదే ఊదరగొడుతున్నారు. అదే సమయంలో వెంటనే పార్లమెంటు ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం కూడా పావులు కదుపుతోంది.

 

ఇదే విషయమై చంద్రబాబు తన ఎంఎల్సీలకు భరోసా ఇస్తున్నట్లు జగన్ మీడియా వెల్లడించింది. పార్లమెంటులో మండలి తీర్మానం అసలు చర్చకే రాకుండా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారట. మండలి తీర్మానం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఓ షాడో పార్టీని ఏర్పాటు చేశామనేట్లు చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారట ఎంఎల్సీలు. ఈ విషయంలో టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి సహకారం తీసుకోబోతున్నట్లు చంద్రబాబు చెప్పారట.

 

బాధ్యత మొత్తం సుజనాపైనే వదిలేయకుండా  చంద్రబాబు కూడా ఢిల్లీలోని బిజెపి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఎంఎల్సీలు చెప్పుకుంటున్నట్లు జగన్ మీడియా చెప్పింది. నిజానికి చంద్రబాబును బిజెపి అగ్రనేతలెవరూ దగ్గరకు కూడా రానీయటం లేదన్నది వాస్తవం. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. వెంకయ్య ద్వారా తెరవెనుక ప్రయత్నాలకు దిగినట్లు చంద్రబాబును అనుమానిస్తున్నారు. మరి వెంకయ్య అయినా చంద్రబాబును ఆదుకుంటారా ? చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: