హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెట్రో రైల్వే సంస్థ శుభవార్త చెప్పింది. మెట్రో రైల్వే సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల కొరకు కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సర్వీసులను మెట్రో రైల్వే సంస్థ ప్రారంభించింది. ప్రముఖ సంస్థ రెడ్ బస్ తో హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
 
మెట్రో సంస్థ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడం కొరకు కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామని ప్రముఖ సంస్థ రెడ్ బస్ తో దీనికి సంబంధించిన డీల్ ను కుదుర్చుకున్నామని అన్నారు. ఆర్ - పూల్ అనే రైడ్ షేరింగ్ యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని చెప్పారు. 
 
ట్రాఫిక్ రద్దీ కూడా కార్ పూలింగ్, బైక్ పూలింగ్ వలన తగ్గే అవకాశం ఉందని ఎస్వీఎన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సర్వీసులు ఆఫీస్ లకు వెళ్లేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొనిరావటం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు కూడా సొల్యూషన్ లభిస్తుందని ఎస్వీఎన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఎస్వీఎన్ రెడ్డి కార్ పూలింగ్/ బైక్ పూలింగ్ ఉపయోగించుకొని ప్రయాణం చేయటానికి కిలో మీటర్ కు 2 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కార్ పూలింగ్, బస్ పూలింగ్ సర్వీసుల కొరకు కొంత స్థలం కేటాయిస్తామని ఎస్వీఎన్ రెడ్డి అన్నారు. ఆర్ - పూల్ అనే రైడ్ షేరింగ్ యాప్ ను ఉపయోగించుకునే కస్టమర్లకు 1000 మెట్రో స్మార్ట్ కార్డులను కూడా అందిస్తామని ఎస్వీఎన్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రవేశపెట్టనున్న ఈ సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: