జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో కూడా చ‌లి చ‌లిగానే ఉండేది. దాదాపుగా శివ‌రాత్రి వ‌ర‌కు చ‌లిపోదు అంటారు. శివ‌రాత్రిరోజు శివ శివ అంటూ చ‌లి కూడా వెళ్ళిపోతుంది అంటూ పెద్దవారు చెబుతుంటారు. అయితే దీనికి విరుద్ధంగా మారియా ఈ మ‌ధ్య వాతావ‌ర‌ణ విశేషాలు. నిన్న‌టి నుంచి ఎందుకో వాతావ‌ర‌ణంలో చాలా మార్పులు క‌న‌ప‌డుతున్నాయి. అప్పుడే ఎండ‌లు భ‌గ్గుమంటున్న నేప‌ధ్యం క‌న‌ప‌డుతుంది. ఇక ఇదిలా ఉంటే...సూర్యుడి ఉపరితలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు. టెలీస్కోప్‌ ద్వారా సూర్యుడి ఉపరితలాన్ని చిత్రీకరించి వాటిని ప్రపంచానికి చూపించారు. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) తమ పరిశోధనల్లో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలను చిత్రీకరించింది. 

 

సైన్స్ ఫౌండేష‌న్‌ డేనియల్ కె. ఇనోయ్ సోలార్ టెలిస్కోప్‌ను ఉపయోగించి తీశారు. ఈ ఫొటోలను శాస్త్రవేత్తలు నిన్న అన‌గా జనవరి 29, 2020 న విడుదల చేశారు. ఈ చిత్రాలను చూస్తే.. సూర్యుడి ఉపరితలంపై టెక్సాస్ రోలింగ్ పరిమాణంలో ఉండే సెల్ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ చిత్రాల‌లో పాదముద్రలను పోలి ఉన్న‌ట్లు ఉన్నాయి. దీంతో సూర్యుని పై సూర్యుని పై ఈ చిత్రాలతో సూర్యుడిని మరింత అర్థం చేసుకునేందుకు, భూమిపై దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డేట‌ట్లు వీలు లభించినట్లయింది. 

 

 ఇక ఆ కాలంలో గెలీలియో సంద‌ర్భం నుండి ఇప్ప‌టివ‌ర‌కు కూడా సూర్యుడి అధ్య‌యనం చేయ‌డం చాలా గొప్ప‌గా ప‌ని చేసింద‌ని ఫ్రొఫెస‌ర్ జెఫ్ కుహ్న్ తెలిపారు.  IFA శాస్త్రవేత్తల బృందం రెండు సంక్లిష్టమైన పరికరాలను సృష్టించింది. మొదటిదాన్ని క్రయోజెనిక్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోపోలారిమీటర్ అంటారు. ఇది సూర్యుడు వ‌ద్ద జ‌రిగే ప‌రిణామాలు అలాగే తుఫాన్ లాంటి ప్ర‌మాదాల‌ను క‌నుక్కునే అయ‌స్కాంత కార్య‌క‌లాపాల‌ను అంచ‌నా వేసేలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక రెండవది.. డిఫ్రాక్షన్ లిమిటెడ్ నియర్ ఐఆర్ స్పెక్ట్రోపోలారిమీటర్.  ఇది సూర్యుని వ‌ద్ద ఉన్న ఆ అయ‌స్కాంతి ప‌రిణామాల‌ను చూడ‌టానికి అంచ‌నా వేయ‌టానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: