టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందో మోస‌లు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఆన్‌లైన్ ఆక‌తాయిలు ఎప్పుడు ఏ విధంగా ఎలా మోసం చేస్తారో కూడా మ‌నం తెలుసుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి. అందులో ఆన్‌లైన్ మోసాలు మ‌రీ ఎక్కువ‌యిపోయాయి. అందులో యువ‌త ఎక్కువ‌గా ఫోన్ వాడటం వ‌ల‌న ఇలాంటి అన‌ర్ధాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఒక‌ప్పుడు ఫోన్‌ని కేవ‌లం మాట్లాడ‌టానికి మాత్ర‌మే వాడేవారు కానీ ఇప్పుటి జీవ‌న‌శైలిలో అదే ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. కొత్త కొత్త యాప్స్‌ని వాట‌డంలో ఎక్కువ‌గా నేటి యువ‌త ప్ర‌త్యేక‌మైన ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. 

 

వీడియో కాల్స్ యాప్స్‌, వాట‌డంలో కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువుగా ఉంటున్నారు... వీళ్ల‌కు ఇదొక వ్య‌స‌నంగా మారిపోయింది. యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే మ‌న‌ఫేస్‌బుక్ ఖాతా లేదా జీ మెయిల్‌ఖాతా ద్వారా యాప్‌లోకి ఎంట‌ర్ అయిపోతున్నారు. ఇంక అంతే అస‌లు మ‌జా అంతా ఇక్క‌డే ఉంది. మ‌న‌ బ్యాంకు ఖాతా గుల్ల చేసే ప‌నిలో ఉంటున్నారు. అదెలా అనుకుంటున్నారా... ఇదిగో చూడండి ఇలా  ఏ దేశం అమ్మాయి కావాలి.  ఏ లొకేష‌న్‌లో  కావాలి. ఎలాంటి ఆంటీలు కావాలి అంటూ ముక్కూ మొఖం తెలియ‌ని వారితో కాల్ మాట్లాడే ఛాన్స్ క‌ల్పిస్తున్నారు. అందులో అలాంటి  కాయిన్ల‌ రేట్లు తొంబ‌యి రూపాయ‌ల నుంచి కొన్ని వేల‌ వ‌ర‌కు ఉంటున్నాయి. ముందు నెమ్మ‌దిగా వీడియో, వాట్సాప్ కాల్స్‌తో వ‌ల‌వేస్తున్నారు. ఆ త‌ర్వాత మీకు ఈ అమ్మాయిల ఇంట్ర‌స్ట్ చూపిస్తారు.

 

 నిధానంగా ఈ కాయిన్ల గురించి చెబుతారు. ఇక మ‌నం ఏ మాత్రం ఆశ ప‌డి కాయిన్లు కొన్నామా అంతే సంగ‌తులు మ‌న బ్యాంక్ ఖాతాల‌న్నీ గుల్లే... ఎలా అనుకుంటున్నారా.  ఆ కాయిన్ కొని కాల్ మాట్లాడ‌టంతో  అక్కౌంట్ నెంబ‌ర్లు  హ్యాక్ చేసే హ్యాకర్ల ఖాతాలోకి వెంట‌నే వ‌చ్చేస్తారు. అంతే దెబ్బ‌కి మ‌న బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు మాయం అయిపోతాయి. మ‌రి ఇలాంటి సైబ‌ర్ నేర‌గాళ్ళ‌ను క‌నుగొని పోలీసులు వీరి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే బావుంటుంది. ఇలాంటి నేరాల‌కు ఎక్కువ‌గా యువ‌తే పాల్ప‌డుతున్నారు. చ‌దువుకుని ఉన్న‌త‌మైన స్థానానికి వెళ్ళ‌డం మానేసి వారి చ‌దివిన చ‌దువును, టెక్నాల‌జీని ఈ విధంగా ఉప‌యోగిస్తూ చివ‌రికి సైబ‌ర్ నేర‌గాళ్ళ‌గా గుర్తింపు పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: