కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కేంద్రం ఈసారి ఎటువంటి సంస్కరణలు తీసుకు వస్తుంది..?  జనాలకు మేలు చేసేలా ఎటువంటి కొత్త పథకాలు ప్రవేశ పెడుతుంది..?  అని సామాన్య ప్రజలు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తీవ్రతరం అవుతుండడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదల పైకి పైకి వెళ్తోంది తప్ప కిందకు దిగడంలేదని, అదే సమయంలో ఆదాయ మార్గాలు కూడా సన్నగిల్లిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతుండడంతో సామాన్యుల జీవితం దుర్భరం అవుతోంది. ఈ దశలో కేంద్ర బడ్జెట్లో ఈ అంశాలకు ప్రాధాన్యం, రేట్ల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి గా ఉన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో నిత్యావసరాల ధరలకు కళ్ళెం వేస్తూ సామాన్యుల బతుకులు బాగు చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. 


బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక మాంద్యం లేకుండా అడ్డుకట్ట వేస్తామని చెబుతున్నా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక బిజెపి ఒక్కో రాష్ట్రంలో బలహీనం అవుతున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్ పై పెరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ద్వారా ప్రజల మనసును గెలుచుకోవాలని బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ బిజెపి ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నిర్మల సీతారామన్ కేంద్ర మంత్రిగా సామాన్య జనాల దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఎటువంటి సంచలన నిర్ణయాలు ప్రకటించి ఆదుకుంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: