ప్రపంచ దేశాలన్నింటిలో ప్రజలను ప్రాణ భయంతో వణుకు పుట్టిస్తున్న వైరస్ కరోనా. ఇప్పుడు ప్రపంచ దేశాలు అందరూ చర్చించుకుంటున్నారు దీనిపైనే. చైనాలో పుట్టిన ఈ కరోనా  వైరస్... శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు.ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ తమ దేశంలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి తమ తమ దేశాలకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ లేదు అని నిర్ధారించిన  తర్వాతనే దేశంలోకి అనుమతిస్తున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం తెలంగాణకు కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా కరోనా వైరస్ బాధితులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న హైదరాబాద్ లో నలుగురు చైనా నుంచి వచ్చిన వ్యక్తులు అనారోగ్యానికి గురికావడంతో కరోనా వైరస్ అనే అనుమానంతో ప్రత్యేక వార్డులో  ఆ నలుగురు వ్యక్తులకు చికిత్స అందించిన విషయం తెలిసిందే.  అనంతరం వారికి కరోనా వైరస్ సోకలేదు అని నిర్ధారణ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణలోని మరో  జిల్లాలో  కరోనా వైరస్ బారినపడిన కొంత మంది అనుమానితులను గుర్తించారు. దీంతో వైద్యాధికారులు అందరూ అలెర్ట్ ఐపోయారు. 

 


 చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన వారికి... కరోనా  వైరస్ సోకిందనే అనుమానం తో వైద్యులు వారిని  వారికి ప్రత్యేకవాదులు చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో  ముగ్గురికి కరుణ వైరస్ సోకినట్లు సందేహాలు కూడా వస్తున్నాయి. వెంటనే వారి వద్ద నుంచి నమూనాలను సేకరించి వైద్యులు ఆ నమూనాలను పూణే కు పంపించారు. కాగా  వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్... తెలంగాణలో కూడా వ్యాధి వ్యాప్తి చెందినట్లు అనుమానితులు తెర మీదికి రావడం తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: