ఫిబ్రవరి 1 నుంచి 2020 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బడ్జెట్ పై నే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. కాగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి కీలక నిర్ణయాలు వెల్లడించ పోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఆయ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకింగ్ రంగ సంస్థలు ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్పై ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా బ్యాంకింగ్ రంగ వృద్ధిరేటు రోజు రోజుకి తగ్గిపోతున్న విషయం తెలిసిందే. 

 


 ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ లో ఏమైనా చర్యలు ఉంటాయా అనేది ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న. అయితే గత బడ్జెట్ లో మధ్యతరగతి వర్గానికి ఇంటి రుణాలు ఇచ్చేలా... చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇంటి రుణాలపై తక్కువ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిర్ణయించినప్పటికీ.. ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. పూర్తిస్థాయిలో గతంలో కేంద్ర బడ్జెట్ ప్రకటించిన సమయంలో తీసుకున్న చర్యలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మరి ఈసారి కేంద్ర బడ్జెట్ లో బ్యాంకింగ్ రంగం పుంజుకునేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 

 


 ఇప్పుడైనా కేంద్ర బడ్జెట్లో మరిన్ని రాయితీలు ప్రకటించటం తో .. ఏమైనా వడ్డీ కోతలకు అవకాశం ఉంటుందా లేదా అన్నది  అందరిలో నెలకొన్న ప్రశ్న. అయితే దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం కారణంగా బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యోల్బణ రేటు రోజురోజుకు దిగజారిపోతున్న క్రమంలో బ్యాంకింగ్ రంగానికి ఊతం ఇచ్చి  బ్యాంకింగ్ రంగం మరింత పుంజుకునేలా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక ప్రతిపాదనలు ఉంచింది  అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి దీని గురించి పూర్తిగా తెలియాలంటే బడ్జెట్ విడుదల అయ్యేంత  వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: