తెలంగాణ రాష్ట్రంలో వివాహిత సమత అత్యాచారం హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లయిన వివాహితను కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు మృగాళ్లు... కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాదులో  దిశ ఘటన జరిగిన  మూడు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. కాగా  కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా లో జరిగిన సమత అత్యాచారం హత్య కేసులో ప్రస్తుతం కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసును త్వరగా పరిష్కరించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు భావించగా కేవలం కేసు నమోదయిన 45 రోజుల్లోనే కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 

 

 

 ఆదిలాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈ  తీర్పు వెలువరించింది. ఉరిశిక్షను ఖరారు చేయగానే ఈ కేసులో నిందితులైన షేక్ బాబు,  షాబుద్దీన్ ముగ్దుమ్  కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా వివాహిత సమత అత్యాచారం జరగడం తో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. అయితే నవంబర్ 24న కొమరం భీమ్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్  శివారులో సమత పై అత్యాచారం హత్య చేశారు ముగ్గురు నిందితులు. కాగా అత్యాచారం జరిగిన కేవలం 45 రోజుల్లోనే ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటం గమనార్హం.

 

 

మొదటిసారి అత్యాచారం చేసిన నిందితులకు కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఉరిశిక్షను ఖరారు చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అత్యాచారం కేసులో ఇంత తొందరగా తీర్పు వెలువడటం... నిందితులకు ఉరిశిక్ష పడటం ఒక రికార్డు అనే చెప్పాలి. కాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సత్వరంగా ఉరిశిక్షను విధించింది అప్పటికీ.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత స్థాయి న్యాయస్థానాల్లో రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: