9నెలల్లో విశాఖకేంద్రంగా 30వేల ఎకరాలుకొట్టేశారని, వాటి విలువ పెంచుకోవడానికి   తనబంధువుల కంపెనీ అరబిందోఫార్మాకింద ఉన్న భూములు అమ్ముకోవడానికి, వాల్తేర్‌క్లబ్‌ని మింగేయడానికి, దసపల్లాభూముల్ని భోంచేయడానికే ప్రభుత్వం విశాఖ జపం చేస్తోందని బొండా పేర్కొన్నారు. విజయమ్మ విశాఖలో పోటీచేసినప్పుడు, ఆ నగరమంతా గడగడలాడిపోయిందని, పంచెకట్టు బ్యాచ్‌చేసిన అరాచకం అంతాఇంతా కాదన్నారు. ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పేరుతో ప్రభుత్వం అక్కడ స్పెక్యులేషన్‌ మొదలెట్టి, భూములవిలువను పెంచుతోందన్నారు. 

 

రియల్‌ఎస్టేట్‌ముసుగులో రాజధానిని తరలించే కుట్రకు జగన్‌సర్కారు తెరలేపిందని, అందుకు బూచిగా జీ.ఎన్‌.రావు, బోస్టన్‌కమిటీలను, బ్రెయిన్‌లెస్‌ హైపవర్‌కమిటీలను చూపిందన్నారు. విశాఖనగరాన్ని కించపరుస్తూ జీ.ఎన్‌.రావు కమిటీనివేదికఇస్తే, దాన్ని మంత్రులు, అధికారులు ఉన్న హైపవర్‌కమిటీ ఏం పరిశీలించిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని  జగన్‌సర్కారు చెబుతుంటే, జీ.ఎన్‌.రావుకమిటీలో మాత్రం హైకోర్టు ఏర్పాటనేది, సుప్రీంకోర్టు అంతిమనిర్ణయమని పేజీనెం-76లో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కర్నూలు ప్రజలని మోసగించడానికే ఇలా చెబుతున్నారని, కర్నూల్లో, అమరావతిలో పెట్టడానికి అవేమైనా భారతిసిమెంట్‌ కంపెనీ బ్రాంచ్‌లా అని బొండా ఎద్దేవాచేశారు. 

 

ఏకమిటీ రిపోర్టు బయటకురాదన్న ఉద్దేశంతో, వాటినిదాచేసి, ప్రభుత్వం మూర్ఖంగా  ముందుకెళుతోందన్నారు. రైతులు కోర్టుకువెళ్లబట్టే, కమిటీల నివేదికలు బయటకు వచ్చాయని, దాంతో జగన్‌సర్కారు బండారం బయటపడిందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై హైకోర్టు చాలాస్పష్టమైన ఆదేశాలిచ్చిందని, తాముచెప్పేవరకు ఏవిభాగా న్ని తరలించినా లారీకెత్తిన సామాన్లబాడుగతో సహా అధికారులనుంచి వసూలుచేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. తుపాన్లువస్తే, వెంటనే పోతాయని, వరదలొస్తే ఎప్పటికీపోవని చెబుతున్న బిత్తరసత్తి (మంత్రిబొత్స)    ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని, అసలు ఆయనకు తుపాన్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసునాఅని ఉమా మండిపడ్డారు. 


శ్రీకాకుళంలో తిత్లీ వచ్చినప్పుడు, పక్కనేఉన్న జగన్‌, పక్కజిల్లాలో ఉన్న బొత్స ఏంచేశారన్నారు. ఒక నగర నిర్మాణమంటే లోటస్‌పాండ్‌ కట్టినంతతేలికకాదనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గ్రహించడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధప్రభుత్వవిభాగాల కింద 130శాఖలున్నాయని, అవన్నీ విశాఖలో పెట్టినంతమాత్రాన నగరం రూపురేఖలు మారుతాయా అని ఉమా ప్రశ్నించా రు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఈకమిటీలన్నీ పనిచేసి ఉంటే, అవిఇచ్చిన నివేదికల్ని ప్రభుత్వం ప్రజలముందు ఎందుకు పెట్టలేదన్నారు. ఒకేరాష్ట్రం-ఒకేరాజధాని నినాదమే అంతిమమని, దాన్ని అమలుచేసేవరకు పార్టీలు, ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని బొండా తేల్చిచెప్పారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: