ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రభావితం చేసే దిశగా ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని నిర్ణయాల విషయాలలో తన పరిపాలన కే తలనొప్పులు తెచ్చి పెట్టే విధంగా మారుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేసుల విషయములో రాష్ట్ర హైకోర్టులో వాదన కి సంబంధించి పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధానికి సంబంధించిన కేసును వాదించడానికి దేశ రాజధాని న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి రూ. 5 కోట్లు ఇచ్చేందుకు జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని అమరావతి కి చెందిన సుధాకర్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

అంతేకాకుండా సదరు ఢిల్లీ లాయర్ కి ముందుగా కోటి రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పిటిషనర్ సుధాకర్ బాబు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా అంత డబ్బు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికాశాఖ కార్యదర్శిని పేర్కొన్నారు. దీంతో ఈ వార్త ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు అదే విధంగా సోషల్ మీడియాలో రావడంతో జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

కేవలం 60 కోట్లు సంవత్సరానికి నష్టమని పెద్దల సభ అయిన శాసనమండలిని రద్దు చేసిన జగన్ ఎన్నో కోట్లు పెట్టి వేరే రాష్ట్రానికి చెందిన లాయర్ ని అమరావతి భూముల విషయంలో వాదించడానికి కోట్ల డబ్బు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రజలు మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు. దీంతో లాయర్ కి అన్ని కోట్ల డబ్బు ఇచ్చిన జీవో పై చాలా వ్యతిరేకత రావటంతో జగన్ మరియు మంత్రులు కూడా డైలమాలో పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: