జనవరి 31వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఇంకెంతో మంది ప్రముఖుల జననాలు... మరెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి చూస్తే జనవరి 31వ తేదీన ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 జాతీయ పక్షి నెమలి : 1963 జనవరి 31వ తేదీన భారత జాతీయ పక్షిగా నెమలి ప్రకటించబడింది. ఇప్పటికి నెమలి భారత జాతీయ పక్షి గానే కొనసాగుతోంది. 

 

 రాగ్నర్ ఫ్రిష్ జననం : ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫిష్  1895 జనవరి 31వ తేదీన జన్మించారు. నార్వే రాజధాని అయిన ఓస్లో  లో జన్మించిన ఈయన ఓస్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. 1930 సంవత్సరంలో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్ములాను ఉపయోగించి ఎకనామెట్రిక్స్ శాస్త్రానికి అంకురార్పణ చేశాడు రాగ్నార్ ప్రిష్.

 

 కందుకూరి రామభద్రరావు జననం : ప్రముఖ తెలుగు రచయిత కవి అయిన కందుకూరి రామభద్రరావు 1905 జనవరి 31వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు భాషలో ఎన్నో రచనలు కవిత్వాలు రాసి తెలుగు ప్రజలకు అందించారు. 1976 సంవత్సరంలో కందుకూరి రామభద్రరావు మరణించారు.

 

 రావెళ్ల వెంకట రామారావు జననం: తెలంగాణ తొలితరం కవి అయిన రావెళ్ళ వెంకటరామారావు 1927 జనవరి 31వ తేదీన జన్మించారు. ఈయన  తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రావెళ్ల వెంకట రామారావు. అంతేకాకుండా పోరాటం సమయంలో తన రచనలు పాటల ద్వారా ఎంతో మంది ప్రజల్లో చైతన్యం కల్పించాడు.

 

 

 సినీ నటి రక్ష జననం : ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కథానాయక రక్ష.ఈమె 1974 జనవరి 31వ తేదీన జన్మించారు  తెలుగు తమిళం కన్నడ మరియు హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు నటి రక్షా. ముఖ్యంగా తెలుగులో నచ్చావులే,  పంచదార చిలక,  ప్రేమలేఖ లాంటి సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికి ఎన్నో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

 

 వనమాలి జననం : ప్రముఖ సినీ గేయ రచయిత అయిన వనమాలి 1974 జనవరి 31వ తేదీన జన్మించారు. హ్యాపీడేస్ చిత్రానికి గేయరచయితగా తొలి ఫిలిం ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు ఈయన  పాటలు రాసి అందించారు వనమాలి.

 

 ప్రీతి జింట : ప్రముఖ సినీ నటి అయిన ప్రీతిజింటా  1975 జనవరి 31వ తేదీన జన్మించారు. మోడల్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రీతిజింటా ఆ తర్వాత కథానాయిక ఎన్నో ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ కొనసాగారు. ఇక తన చిలిపి నవ్వుతో ఎంతో మంది సినీ ప్రేక్షకులు మతిపోగొట్టారు  ప్రీతిజింటా. ఎందరో  స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.ఇక ప్రీతిజింటా ఎన్నో అవార్డులు రివార్డులను సైతం అందుకున్నారు . ముఖ్యంగా ప్రీతి జింటా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. బాలీవుడ్ తో పాటు తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించారు ప్రీతిజింటా.  ఇప్పటికీ ఎన్నో అవకాశం చేజిక్కించుకుని దూసుకుపోతున్నారు. ఇక తెలుగులో కూడా సినిమా హీరో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించారు. స్టార్ హీరోల సరసన నటించిన ప్రీతిజింటా ... తనదైన అందం అభినయం తో ఎంతో క్రేజ్ సంపాదించారు.

 

 

 షాజహాన్ మరణం : మొఘల్ సామ్రాజ్యపు 5 వ  చక్రవర్తి అయిన షాజహాన్  1666 జనవరి 31వ తేదీన మరణించారు. ఈయన భారత ప్రజలందరికీ కొసమెరుపు. ఎందుకంటే షాజహాన్ కట్టించిన తాజ్మహల్ ఇప్పటికి  ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటి గా కొనసాగుతున్నది .

మరింత సమాచారం తెలుసుకోండి: