తనను నమ్ముకున్న వారు... తాను నమ్మిన వారి కోసం ఏం చేసేందుకైనా వెనకాడకుండా వారికోసం ఆలోచిస్తాడనే ముద్ర వేయించుకున్నారు ఏపీ సీఎం జగన్. తాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి తనకు అన్ని విషయాల్లో అండగా ఉంటూ వచ్చిన వారికి అధికారంలోకి వచ్చిన తరువాత అదే స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన కొంతమందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మరి వారికి తన కేబినెట్లో స్థానం కల్పించారు జగన్. ఆ విధంగా మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవి చేపట్టగా,  ఏపి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎమ్యెల్సీ కోటాలో పదవులు దక్కాయి.


తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడం, అది మరో రెండు మూడు నెలల్లో ఆమోదం పొందేలా కనిపిస్తుండడంతో జగన్ కు అత్యంత సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటి అనేది కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో పార్టీలు చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. జగన్ శాసనమండలిని రద్దు చేయడం తాము స్వాగతిస్తున్నామని, దీంట్లో తమకు ఎటువంటి బాధా లేదు అంటూ ఇప్పటికే వారిద్దరూ ప్రకటించారు. ఇక జగన్ ఈ ఇద్దరికీ ఉన్నతమైన పదవులు ఇచ్చి వారి ప్రాధాన్యత తెలియజేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఇద్దరిలో ఒకరికి త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.


 డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో పదవిని కూడా జగన్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లుగా తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోల్పోతున్న పిల్లికి గుడా ( గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని ఇచ్చేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. టిడిపి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ సంస్థ పరిధిని మరింతగా పెంచి సుభాష్ చంద్రబోస్ కు పదవి ఇచ్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలోనూ ఇదే ఆలోచనలో ఉన్న జగన్ కు కూడా సముచిత స్థానం కల్పించి ప్రభుత్వ పదవిని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఆయనకు ఏ పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు అనేది ఇంకా తెలియలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: