కుటుంబ స‌భ్యులు వేరు స్నేహితులు వేరు. చాలా మంది కుటుంబ స‌భ్యుల‌క‌న్నా స్నేహితుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌తిస్తుంటారు. చివ‌రికి మోస‌పోతుంటారు. నిండా మునిగాక‌గాని వాళ్ళకి అర్ధం కాదు వాళ్ళు పోస‌పోయార‌ని ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఇటీవ‌లె చోటుచేసుకుంది. ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం త‌న చేతులారా తానే అంధ‌కార‌మ‌యం చేసుకుంది. పెళ్ళి చేసుకుని ఎంతో ఆనందంగా జీవితం సాగిస్తున్న ఆమెకు అనుకోకుండా భ‌ర్త చ‌నిపోయాడు దాంతో ముగ్గురు పిల్లలను పోషిస్తూ బతుకును భారంగా జీవితాన్ని సాగిస్తోంది. 

 

పీకల్లోతు బాధల్లో మునిగితేలుతున్న ఆమెకు ఇటీవ‌లె వ‌చ్చిన టిక్‌టాక్ యాప్‌ కొంచెం హాయిని కలిగించింది. అందులో పరిచయమైన ముగ్గురు స్త్రీలను నిజమైన స్నేహితులుగా భావించి. వారితో త‌న క‌ష్ట‌సుఖాల‌ను. పంచుకుంది. సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన మనోహరన్‌, కడల్‌కన్ని దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త మృతి చెందడంతో ఆమె, పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దే ఉంటూ బ్ర‌తుకు భారాన్ని మోస్తుంది. 

 

ఆమెకు ఇటీవల టిక్ టాక్ యాప్‌లో చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు ఆడ‌వారు పరిచయమై స్నేహితులుగా మారారు. కొంతకాలం ఆమెతో స్నేహంగా ఉన్న ఆ మహిళలు తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వ్య‌భిచారం చేయాలంటూ ఆమె పై ఒత్తిడికి తీసుకొచ్చారు. 
ఇద్దరు మ‌గ‌వారిని పంపి 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్‌ చేసి హత్య చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించింది.

 

కానీ పోలీసులు ఈ విష‌యం ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించారు. వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్‌కన్ని ఇంట్లో నే ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబ స‌భ్యులు ఉరితాడును తొలగించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉందంటూ వైధ్యులు నిర్ధారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: