ఈ హెడ్డింగ్ చూడ‌డానికి చాలా కొత్త‌గా ఉన్న‌ట్టే అనిపిస్తుంది. చంద్ర‌బాబును గెలిపించ‌డం ఏంటి ?  కొత్త ఛానెల్ రావ‌డం ఏంట‌ని... ఎందుకంటే చంద్ర‌బాబు న‌ల‌భై సంవ‌త్స‌రాల అనుభ‌వం బేల‌జారి.. ఆలోచ‌న‌ల్లో సంకుచిత‌త్వం పెరిగి ఇప్పుడు ఆయ‌న పూర్తిగా త‌న‌కు తానుగా ఏం చేస్తున్నాడో ?  ఏం చేయాలో తెలియ‌క చివ‌ర‌కు ఓ రెండు, మూడు ఛానెల్స్‌ను న‌మ్ముకున్నారు. ఏపీలో మీడియా, ఛానెల్స్ అంద‌రిది ఓ దారి అయితే.. ఆ రెండు ఛానెల్స్‌ది మ‌రోదారి. బాబు భ‌జ‌న చేసి.. టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తొక్క‌తోన్న అడ్డ‌దారులు అన్నీ ఇన్నీ కావు.

 

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించింది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించేయాలని వైసీపీ భావిస్తోంది. కేంద్రం వద్ద ఆ దిశగా వైసీపీ పెద్దలు లాబీయింగ్‌ షురూ చేశారు. ఇక ఎలాగైనా శాస‌న‌మంలిని అడ్డుకోవాల‌ని బాబు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక లాభం లేద‌నుకున్న బాబు ఇప్పుడు త‌న‌కు కొమ్ము కాసి డ‌బ్బు కొట్టే ఆ రెండు ఛానెల్స్‌నే న‌మ్ముకున్నారు.

 

ఆ రెండు ఛానెల్స్‌తోనే బాబు అనుకున్న‌వి అన్ని జ‌రిగినా.. మండ‌లి ర‌ద్దు అయినా ఇక ఏపీ జ‌నాలు ఎందుకు ?  ఈ వైసీపీ, బీజేపీ ప్ర‌భుత్వాలు ఎందుకు ? అన్న‌ది బాబోరికే తెలియాలి. మ‌రోవైపు కేంద్రం కూడా మండ‌లి ర‌ద్దు విష‌యంలో సానుకూల‌త‌తో ఉన్న‌ట్టు ఆ పార్టీ నేత‌లే చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అలజడి వచ్చి, తద్వారా తెలుగుదేశం పార్టీ పూర్తిగా గల్లంతయిపోవాలని బీజేపీ కోరుకుంటే, అతి త్వరలో శాసన మండలి రద్దయిపోతుంది. 

 

ఇప్ప‌టికే శాస‌న‌స‌భ‌లో టీడీపీ మాట ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు త‌న ఛానెల్స్‌ను జ‌నాల మీద‌కు, వైసీపీ, కేంద్రం మీద‌కు వ‌దిలిన‌ట్లున్నారు. మ‌రి బాబోరు అనుకుంటున్న‌ట్టు ఆ ఛానెల్సే ఆయ‌న్ను గెలిపిస్తే ఆయ‌న గెలిచేందుకు ఇంత‌గా క‌ష్ట‌ప‌డాలా ?  ఇన్ని పాట్లు ప‌డాలా ?  మ‌రో కొత్త ఛానెల్ పెట్టుకుంటే స‌రిపోతుందిగా ?

మరింత సమాచారం తెలుసుకోండి: