అయిపోయింది... అనుకున్నదంతా అయిపోయింది. అసలు నేను ఏదైతే అవ్వకూడదని  అనుకున్నానో అదే అయిపోయింది. సర్వ నాశనం అయిపోయిందిరా బామ్మర్ది. ఏంటేహే.. నీ నస నాకసలే కొంచెం తిక్కుంది దానికి లెక్కలేదు అని నీకు తెలుసుగా ...? సూటిగా చెప్పకపోతే బావ అని కూడా చూడకుండా దబిడి దిబిడి చేసేస్తా అంతే ! నా పేరు తెల్సుగా బాల సింహా అని. ఏమీలేదమ్మా బాలా ..! మన పార్టీ సంగతి ఏంటో నాకు అర్ధమయ్యి చావడంలేదు. దీనిని ఎలా నడిపించాలో నాకు అర్ధం కావడంలేదు. నాకా వయస్సు అయ్యిపోయింది. పోనీ నీ అల్లుడు, నా పుత్ర రత్నం అయిన మన మాలోకానికి డ్రైవింగ్ సీటు ఇద్దామా అంటే వాడికి బ్రేకుకి, ఎక్సలేటర్ కి తేడా తెలియదు. 


పోనీ మంచి డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ చేద్దాం బావా ! ఆహా అదీ అయ్యింది. లచ్చల్ లచ్చల్ ఖర్చు పెట్టి నేర్పించినా ప్రయోజనం ఏముంది జనాలను చూస్తే దడపడిపోతున్నాడు. ఈడితో లాభంలేదు అనే నేను ఈ వయస్సులోనూ ఇలా ఆ ఫ్యాను పార్టీ వాళ్ళతో తిట్టించుకుంటున్న. అవును బావా నేను చూస్తున్నా. అప్పుడు నీ ముఖం వాడిపోయిన బెండకాయలా అయిపోతుంది కదా ...? అప్పుడు నేను మూసి మూసి నవ్వులు నవ్వడం నువ్వు చూడలేదా బావా ...? హా చూసాను చూసాను. వీడొకడు వీడు అమాయకుడో ...తింగరోడో ఇప్పటికీ తెల్సి చావడంలేదు. అయినా బామ్మర్ది + వియ్యంకుడు కదా బాధ అయినా భరించాల్సిందే. 


పార్టీని ఎలా గట్టెక్కించాలో ఒక్క సలహా ఇవ్వడు... పోనీ వీడికి నా రాజకీయాలు ఎలా ఉంటాయో నా కూడా తిప్పుకుని నేర్పుదామా అంటే వీడు ఎప్పుడు ఎవడిని కొడతాడో... ఎందుకు కొడతాడో వాడికి కూడా తెలియదు. పోనీ మా మాలోకాన్ని తిప్పుకుందామా అంటే వాడు వీడికి ఏమీ తీసిపోడు. మామా అల్లుళ్ళు ఇద్దరూ సరిపోయారు లంబు జంబులా ! ఒక్కడు కూడా నాకు పనికొచ్చేవాడు లేడు. నా తరువాత ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీని అప్పగించినా మళ్లీ పుట్టగతులు ఉండవు. అయినా నా తంటాలు నేను పడతాలే అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. 


పొద్దు పొద్దున్నే కంగారు కంగారుగా వచ్చిన బామ్మర్ది ని చూసి ఏరా బాలా ఏంటి సంగతి ..? చూసావా బావా నా అల్లుడు.. నీ కొడుకు అయిన మాలోకం పదవి మరో కొద్ది రోజుల్లో ఊడిపోతునని పేపర్లో వేసాడు బావా ! అందుకే ఇంత కంగారుగా వచ్చా. పోన్లేరా బామ్మర్ది పోతే పోనీ వెదవ పదవి. ఆ అసెంబ్లీ లో నన్ను ఎన్ని మాటలు అంటున్నా గుండ్రాయిలా తట్టుకుంటున్నా.. మా మాలోకం అలాంటి తిట్లు తట్టుకోలేడు కదరా ...? పోన్లే ఈ వంకనైనా ఇంట్లో కూర్చుంటాడు లే. అయితే ఇంట్లోనే పార్టీని ఎలా నడిపించాలో ట్రైనింగ్ ఇద్దామా బావా ...? వద్దులేరా వాడికి అంత సీన్ లేదు. పోనీ నన్ను తొడగొట్టమంటావా బావా ...? తొడగొడతావా ..? ఇదేమన్నా సినిమా అనుకున్నావా ...? జనాలు పిచ్చకొట్టుడు కొడతారు జాగ్రత్త ! బావా నేను తొడగొడితే రైళ్ళే వెనక్కి వెళ్లిపోయాయి. ఆఫ్ట్రాల్ ఈ పార్టీలు, జనాలు ఒక లెక్కా ..? వీడొకడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు ! సరి సర్లే కానీ ... అంటే ఏంటి బావా ...? నన్ను తొడగొట్టమంటావా ..? 

మరింత సమాచారం తెలుసుకోండి: