రాజకీయాలలో కొంతమందికి ప్రముఖ రాజకీయ నేతలకు ప్రత్యర్ధి పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పేర్లు పెడుతుంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి విఫలం కావడంతో ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జగన్ పై రెచ్చిపోతున్నారు. ఇటీవల శాసన మండలి రద్దు చేయడం ఆ బిల్లును అసెంబ్లీలో ఆమోదం చేయడంతో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ జగన్ త్వరలో జైలుకి వెళ్లడం గ్యారెంటీ అని అందువల్లనే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్లు మీడియా ముందు తరచుగా మాట్లాడుతున్నారని ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటూ ఆమె పేర్కొంది.

 

అంతేకాకుండా ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు మీడియా ముందు ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఈ సందర్భంగా జగన్ గురించి మాట్లాడుతూ ఏపీ చరిత్ర ఆయన్ని “రద్దుల రెడ్డి” గా గుర్తు పెట్టుకుంటుంది అంటూ ఆమె సెటైర్లు వేయడం జరిగింది. అమరావతి ని రద్దు చేయడం మరియు అదే విధంగా శాసనమండలిని రద్దు చేయడం దాంతో పాటు పేద ప్రజల ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ లను రద్దు చేయటం తో పంచ మూర్తి అనురాధ రెచ్చిపోయింది.

 

దీంతో ఈ వ్యాఖ్యలు విన్న వైసిపి పార్టీ నేతలు సరిగ్గా ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలని జగన్ ' రద్దుల రెడ్డి ' అయితే బాబు ' నాన్చుడు నాయుడ "  అంటూ రెచ్చిపోయారు. ఏ విషయం లో క్లారిటీ లేకుండా ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేసుకుని రాజీనామా చేయాలి ఎన్నికలకు వెళ్లాలి అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద నాన్చుడు నాయుడు అని...అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అమరావతిని రాజధానిగా ప్రకటించి కనీసం ఒక పర్మినెంట్ భవనం కూడా కట్టలేదని పంచుమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: