ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి రద్దు బిల్లుని అసెంబ్లీలో ఆమోదింప చేసి పార్లమెంటు సెక్రెటరీ కి పంపించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ బిల్లు కి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం గ్యారెంటీ అని అధికార పార్టీ నేతలు అంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలు ఖచ్చితంగా శాసన మండలి రద్దు అవధాని కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నానికి అందిన పక్కా సమాచారం ప్రకారం...శాసన మండలి రద్దు అయ్యే అవకాశమే లేదని ఈ విషయంలో కేంద్రం ఖచ్చితమైన అవగాహన ఉందని కేశినేని నాని పేర్కొన్నారు.

 

దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతుల చేత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నట్లు...నాని కి అందిన సమాచారం కరెక్టే అని డిసైడ్ అయినట్లు బిజెపి అగ్రనాయకత్వం జగన్ దూకుడుగా వేస్తున్న అడుగులకు ఈ శాసన బిల్లు రద్దు అంశంలో చెక్ పెట్టడానికి సిద్ధమైనట్లు ఢిల్లీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే అసలైన సమయం అని ఇంకా అమరావతి మరియు శాసన మండలి రద్దు విషయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి జగన్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టాలని టిడిపి నేతలు ఆలోచిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ రెండు పాయింట్లతో రచ్చరచ్చ చేయడానికి ముహూర్తం షురూ చేసినట్లు సమాచారం.

 

మరోపక్క బిజెపి అగ్ర నాయకత్వం కూడా శాసన మండలి రద్దు ని హోల్డ్ లో పెట్టి ఏపీలో బలపడటానికి దారులు వెతుకుతున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. కచ్చితంగా పక్కా సమాచారం ప్రకారం శాసన మండలి రద్దు అనేది జరగదని చాలా బలంగా కేసినేని నమ్ముతున్నట్లు ప్రస్తుతం ఏపీ టీడీపీ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: