40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కంటే....40 ఏళ్ల దాటిన జగన్...రాజకీయాల్లో అదిరిపోయే వ్యూహాలు రచించడంలో బాగా ముందున్నారు. అసలు జగన్ వ్యూహాలు ముందు బాబు ఓల్డ్ వ్యూహాలు చిత్తు అయిపోతున్నాయని 2019 ఎన్నికల్లోనే క్లియర్‌గా అర్ధమైంది. ఇక తర్వాత కూడా జగన్ వ్యూహాలు సెట్ చేస్తే..బాబు అందులో చిక్కుకుంటూ వస్తున్నారు. అలాగే బాబుని మరింత ఇబ్బంది పెట్టడానికి, జగన్ టీడీపీ ఎమ్మెల్యేలని లాగడంలో కూడా పక్కా వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎమ్మెల్సీలు జగన్ వైపు వచ్చిన విషయం తెలిసిందే.

 

అయితే వీరు వచ్చిన నేపథ్యం చూస్తే జగన్ వ్యూహం ప్రకారం వారిని పార్టీకి మద్ధతు తెలిపేలా చేస్తున్నట్లు కనబడుతుంది. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని, భవననిర్మాణ కార్మికులు ఇబ్బందులో ఉన్నారంటూ, బాబు రాజకీయం చేస్తూ, దీక్షకి దిగిన రోజే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెరపైకి వచ్చి బాబుని చెడామడా తిట్టి, జగన్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగానే మూడు రాజధానుల తెరపైకి వచ్చి, బాబు అండ్ కొ అమరావతి కోసం రోడ్ల మీదకు వచ్చిన సమయంలోనే, అమరావతికి అతి దగ్గరగా ఉన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిని పార్టీకి మద్ధతు ఇచ్చేలా చేశారు. పైగా ఈ ఇద్దరినీ పార్టీలోకి తీసుకోకుండా, సెపరేట్ బ్యాచ్‌గా పెట్టారు.

 

ఆ తర్వాత మండలికి మూడు రాజధానుల బిల్లు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇక ఈ పరిణామాలన్నిటిని గమనిస్తే టీడీపీ రాజకీయం చేసే సమయంలోనే జగన్ గట్టి దెబ్బ కొడుతున్నారు. అంటే రానున్న రోజుల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేలని ఒక్కసారిగా పార్టీలో చేర్చుకోకుండా ఒక్కొక్కరినీ టైమ్ బట్టి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇదివరకే పలువురు టీడీపీకి షాక్ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా ఏమి జరగలేదు. జగన్ టైమ్ బట్టే తీసుకోవడం వల్ల వారి వలసలు ఆగినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో స్థానిక సంస్థలు, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి జగన్ వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలని లాగేసి అవకాశముందని సమాచారం. చూడాలి మరి జగన్ ఎలాంటి వ్యూహాలు వర్కౌట్ చేస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: