నారా వారి రాజకీయాల తీరే వేరు.. శత్రువును ధైర్యంగా ఎదుర్కోవడం జగన్ వంటి ముక్కుసూటి నాయకుల పనితీరైతే.. చాణక్యం ప్రదర్శించడం నారా వారి టాలెంటు.. నారా వారిది మొదటి నుంచీ ఇదే టైపు.. సొంత బలం కంటే పక్కోడి వీక్ నెస్ మీద దెబ్బ కొట్టడం.. దాన్ని పైచేయిగా మలచుకోవడం నారా వారికి ఓటుతో పెట్టిన విద్య. అందుకే ఆయన తరచు ఇతర పార్టీల్లోకి తన కోవర్టులను పంపుతుంటారు.

 

అలా తాజాగా పంపిన మరో బ్రహ్మాస్త్రమే జేడీ అని పొలిటికల్ సర్కిళ్లో గుసగుసలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే.. అసలు జేడీ రాజకీయాల్లోకి వస్తా అనగానే అంతా దేశ సేవకే.. అదే అదే తెలుగుదేశ సేవకే వస్తాడని అనుకున్నారు. అందుకోసమే ఆయన ఉద్యోగం నుంచి కూడా ముందుగా రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు సీటుకు కూడా కన్ఫామ్ అయ్యింది దేశ పత్రికలే కోడై కూశాయి కూడా.

 

అయితే జేడీలో కాస్త దేశ సేవ.. తెలుగుదేశం కాదులెండి.. నిజమైనే దేశసేవే.. ఆ బిల్డప్పు కాస్త ఎక్కువ.. తరచూ దేశ భక్తి, వ్యక్తిత్వం, సంఘసేవ అంటూ అప్పట్లో లెక్చర్లు దంచేవారు. ఆ లెక్చర్లు చూసి కొందరు ఆయన బీజేపీలో చేరినా చేరొచ్చని అనుకున్నారు. మొత్తానికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అనుకోకుండా జేడీ వారు జనసేన పక్షం చేసి అందరికీ షాక్ ఇచ్చేశారు.

 

కానీ.. అటు చూస్తే జనసేన లో భవిష్యత్ అంధకారమయమైంది. జనసేనానికే దిక్కులేదు ఇక మన సంగతేంటన్న మథనం జేడీగారిలో మొదలైంది. ఈ మాత్రం దానికేనా ఐపీఎస్ వదులుకుని మరీ వచ్చిందన్న ఆత్మ విమర్శ బాగా జరిగింది. చివరకు జనసేనకు గుడ్ బై చెప్పేశారు. అలా.. మొత్తానికి బాబోరి మరో బ్రహ్మాస్త్రం మళ్లీ వెనక్కి వచ్చింది. మరి ఇప్పుడు ఈ అస్త్రం ఎవరి అమ్ములపొదికి చేరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: