రఘురామకృష్ణంరాజు....నరసాపురం వైసీపీ ఎంపీ. అవ్వడానికి వైసీపీ ఎంపీ అయిన అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకనే వైసీపీలో ఉన్న 21 మంది ఎంపీలది ఒకదారి అయితే రఘురామకృష్ణరాజుది ఒకదారి అవుతుంది. అసలు ఈయన పోలిటికల్ ఎంట్రీనే గజిబిజిగా ఉంటుంది. మొదట్లో వైసీపీ, ఆతర్వాత బీజేపీ, నెక్స్ట్ టీడీపీ, చివరికి 2019 ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలో చేరి నరసాపురం ఎంపీగా గెలిచారు. సరే గెలిచాక అయిన పార్టీ లైన్‌లో నడుస్తారా అంటే..అలా ఏం ఉండదు.

 

నా దారి సెపరేట్ దారి అన్నట్లు ఉంటూ ప్రతిసారి పార్టీలో హాట్ టాపిక్ అవుతారు. ఈయన మొదట నుంచి పార్టీ బాటలో అసలు రాలేదు. ఎక్కువగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటారు. వారికి విందులు ఏర్పాటు చేస్తారు. పైగా బీజేపీ పెద్దలని కలవడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదని తెగేసి చెప్పేస్తారు. ముఖ్యంగా పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి మాట ఈయన అసలు వినడనే టాక్ కూడా ఉంది. అలాగే అప్పుడప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు.

 

ఇటీవల మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే, ఎంపీ మాత్రం అంతా బాగానే ఉంది, హైకోర్టు విజయవాడలోనే ఉండాలనే కామెంట్ వదిలి సంచలనమే లేపారు. ఇక తాజాగా ఓ విషయంలో అలిగి రఘురామకృష్ణంరాజు హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం జరిగింది. దానికి మంత్రులు పేర్ని నాని, ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ నానిలతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని తెగ ఫైర్ అయిపోయారు. ఎంపీగా తాను డయాస్‌ మీద లేకుండా అధికారులు ఉండటంతో కలత చెందానని చెప్పి, సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయారు.

 

అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే, తాను అలాంటి మీటింగ్‌లకు ఇకమీదట వెళ్లబోనని తెగేసి చెప్పేశారు. ఇదే విషయపై మంత్రి పేర్ని మాట్లాడుతూ...ప్రొటోకాల్‌ పాటించలేదని ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ ఎంపీ మాత్రం ఇలాంటి సమావేశాలకు మళ్ళీ హాజరు కానని చెప్పి...మరోసారి వైసీపీలో హాట్ టాపిక్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: