రేవంత్ రెడ్డి...ఓ రాజకీయ సంచలనం. ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఏ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‌పై ఒంటికాలి మీద వెళ్ళే నేత. ఆ విధంగా రాజకీయాలు చేయడం వల్లే అతి తక్కువ కాలంలో రేవంత్...తెలంగాణలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఓ రేంజ్‌లో ఉండే రేవంత్ క్రేజ్ రివర్స్ అయిందా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు. విద్యార్ధి కాలం నుంచి రాజకీయాలు వంటబట్టించుకున్న రేవంత్...టీడీపీ నుంచి 2009లో కొడంగల్‌లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షంలోనే ఉండి అధికార కాంగ్రెస్‌పై గట్టి పోరాటమే చేశారు. తర్వాత కూడా రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ తరుపునే కొడంగల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఊహించని విధంగా ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం వల్ల, టీడీపీకి డ్యామేజ్ అయిందేమో గానీ, రేవంత్‌కు మాత్రం మంచి క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ అలాగే కొనసాగుతూ, టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పైగా కేసీఆర్ పై విమర్శలు దాడి చేయడం వలన మరింత ఎదిగారు. కానీ నిదానంగా టీడీపీ కరుమరుగైపోవడంతో కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు.

 

అక్కడ కూడా రేవంత్ క్రేజ్ కొనసాగింది. కాకపోతే 2018 ఎన్నికల్లో ఒక్కసారిగా దెబ్బ పడిపోయింది. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తన చిరకాల కోరిక ఎంపీ కావాలనే ఆశ 2019 ఎన్నికల్లో నెరవేరింది. మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఏపీ ప్రజలు ఎక్కువ ఉండటం, వారికి రేవంత్‌పై అభిమానం ఉండటంతో గెలుపు సాధ్యమైంది.

 

ఇలా ఎంపీగా అయ్యి దూకుడు మీదున్న రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగే సమయంలోనే మున్సిపల్ ఎన్నికల రూపంలో ఊహించని షాక్ తగ్లింది. కొడంగల్ పరిధిలో ఉన్న కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలని ఓడిపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో రేవంత్ క్రేజ్ కాస్త డౌన్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఎంత డౌన్‌లో ఉన్న మళ్ళీ పుంజుకునే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: