జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్బై చెప్పేశారు. తన రాజీనామాకు సంబంధించిన లేఖను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు జెడి లక్ష్మీనారాయణ. ఈ లేఖలో తన రాజీనామా గల కారణాలు కూడా తెలిపారు. ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారినది . జేడీ రాజీనామాతో పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తాను సినిమాల్లోకి వెళ్ళను అని పలుమార్లు చెప్పారని... తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం అని... సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదు అంటూ ఎన్నో సార్లు తెలిపారు అంటూ జెడి లక్ష్మీ నారాయణ ఆరోపించారు.. 

 

 

 పవన్ కళ్యాణ్ మాట మార్చారు కాబట్టే తాను పార్టీ నుంచి తప్పుకుంటున్న అంటూ తెలిపారు జెడి. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్త కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తెలిపారు.. అంతేకాకుండా జనసేన బీజేపీ తో  పొత్తు లాంటి కీలక అంశాలను తనతో చర్చించక  పోవడం వల్లే తీవ్ర అసంతృప్తితో జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో వదిలినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.  మరోవైపు ఇంకో వార్త కూడా జేడీ లక్ష్మీనారాయణ జనసేన గుడ్ బై చెప్పడం పై ప్రచారం జరుగుతోంది. 

 

 

 జనసేన పార్టీలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ డామినేషన్ తట్టుకోలేక జె డి లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్బై చెప్పినట్లు  తెలుస్తోంది. ఎన్నో విషయాల్లో జేడీ లక్ష్మీనారాయణ నాదెండ్ల మనోహర్ తీరుతో అసంతృప్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ లో డామినేట్ చేస్తారని గత కొంతకాలంగా టాప్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ఇదే కారణమని టాక్ వినిపిస్తోంది. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ తీరు నచ్చక జేడీ లక్ష్మీనారాయణ తో పాటు మరికొందరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: