జేడీ లక్ష్మీనారాయణ.. ఎవరీ జేడీ లక్ష్మీనారాయణ.. ఓ ఐపీఎస్ ఆఫీసరు. మరి దేశంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు.. ఎందుకు అందరూ జేడీలాగా ఫేమస్ కాలేదు.. అంటే ఫేమస్ కావాలంటే కూడా ఫేమస్ పనులు చేయాలన్నమాట. అలా జేడీగారిని ఫేమస్ చేసింది జగన్ ఆస్తుల కేసు. అప్పట్లో ఈ కేసు చాలా ఫేమస్ మరి. ఓవైపు వైఎస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ వచ్చిన రోజులు.

 

ఓవైపు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే ఎదిరించిన జగన్ ను సీబీఐ కేసులు చుట్టుముట్టిన సమయం అది. ఉమ్మడి ఏపీలో అందరి కళ్లూ ఆ కేసుపైనే.. ఓవైపు తండ్రి ఆకస్మిక మరణం. మరోవైపు పార్టీలో అవమానభారం. అయిన వెరవని ధీరత్వం. ఈ సమయంలో ఏం జరుగుతుందో అని అంతా ఉత్కంఠ చూస్తున్న సమయంలో జగన్ ను విలన్ గా చూపించేందుకు తెలుగుదేశానికి, దాని అనుంగు మీడియాకు దొరికిన ఓ అస్త్రం ఈ జేడీ లక్ష్మీనారాయణ అని అప్పటి పరిణామాలు చూసిన వారు అంటుంటారు.

 

సాధారణంగా సీబీఐ వంటి కీలక వ్యవస్థల్లో రోజువారీ విచారణ వివరాలు బయటకు పొక్కవు. కానీ ఎల్లో మీడియాకు మాత్రం అప్పట్లో ఏరోజు ఏం విచారించారు.. అన్న విషయాలు కథలు కథలుగా వచ్చేవి.. ఆ కథనాల్లో హీరోగా జేడీ లక్ష్మీనారాయణ, విలన్ గా జగన్ సహజంగానే ఉండేవారు. అక్కడితో ఆగేవా.. తెలుగు దేశం సోషల్ మీడియా ఈ జేడీని తన సొంత భుజాలపై ఎత్తుకుని.. జేడీని హీరోగా ప్రొజెక్టు చేసింది.

 

రకరకాల స్పూఫులు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేది. ఇలా రోజురోజుకూ జేడీకి కావాలనే క్రేజ్ పెంచేసింది ఎల్లో గ్రూపు. ఆ ఫలితంగానే అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ ఓ హీరోగా వెలుగు వెలిగారు. ఓ ఐపీఎస్ ఆఫీసరుగా కాకుండా.. ఓ సెలబ్రెటీలా ట్రీట్ చేసేవారు. అంతటి ఆ జేడీ.. రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో ఓటమి.. తాజాగా జనసేనకు రాజీనామా.. ఇలా వరుస పరిణామాలతో జీరో అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: