ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం జనసేన పార్టీ నేత  సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పడం. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళను అని... కేవలం రాజకీయాలకు మాత్రమే తన జీవితం అంకితం అని  ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు మాట తప్పి సినిమాలలో  నడుస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట తప్పడం వల్లే తాను జనసేన పార్టీ నుంచి తప్పుకుంటున్నాను  అంటూ జెడి లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొంటూ ఈ లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపించారు. 

 

 

 ఇదిలా ఉంటే జేడీ లక్ష్మీనారాయణ ఎంతో ఆదర్శంగా నిలిచారు అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జెడి దేనికి ఆదర్శం... ప్రజల్లోకి ఒక్కసారి కూడా వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకోనందుక... దేనికి ఆదర్శం. జేడీ లక్ష్మీనారాయణ పదవి విరమణ విషయంలో  తన ప్రయోజనాలను దృష్టిలో  ఉంచుకునే చేశాడు. తన రిటైర్మెంట్ కి కొద్ది నెలల ముందు మాత్రమే రాజీనామా చేశాడు. రిటైర్మెంట్ కి కొద్ది నెలల ముందే రాజీనామా చేసి తాను ప్రజా సేవ చేయడానికి సెంట్రల్  సర్వీస్ కి రాజీనామా చేశాను అంతే గొప్పగా ప్రచారం చేసుకున్నాడు జేడీ లక్ష్మీనారాయణ... దీనికా జెడి ఆదర్శం. లేక తన  కొడుకు సెంట్రల్ సర్వీసు క్యాడర్ లో  చేరిన తర్వాతే పదవికి రాజీనామా చేశాడు..దీనికా ఆదర్శం. 

 

 

 ఇక ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజలకు సేవ చేస్తా అంటూ ఆంధ్రరాష్ట్రంలో తెగ తిరిగేసాడు. ఇక అటు ఇటు తిరిగి చివరికి జనసేన పార్టీలో చేరారు. అసలు జనసేన పార్టీలో చేరడం వెనుక జెడి ఉద్దేశం ఏమిటి..? అసలు  ఏం సాధించిందని జనసేన పార్టీలో చేరాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వీడాడు. ఇలాంటి నేతను ఆదర్శం ఆదర్శం అంటూ కొంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు . జేడీ లక్ష్మీనారాయణ లో ఆదర్శంగా తీసుకోవటానికి అసలు ఏముంది.?  ఎందుకు అంతలా తలకెక్కించుకొని ఆయన కోసం అంతగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు జె డి లక్ష్మీనారాయణ ఎంతో ఆదర్శం అంటూ ప్రచారం చేస్తున్నారు ఏం సమాధానం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: