జనసేన పార్టీకి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనలా నేను గవర్నమెంట్ సొమ్ము బొక్కడంలేదని అన్నారు. లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాము. వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే.

నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ  పార్టీకి రాజీనామా చేసినప్పటికీ  వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే  ఉంటుంది. ఆయనకు పవన్ కళ్యాన్  శుభాభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండగా పవన్ స్టార్ ఈ విధంగా స్పందించాడని కారణం ఏంటంటే..జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్‌లో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని పవన్‌ను ఉద్దేశించి లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా జేడీని బిజెపిలోకి పంపడానికేనా ఇదంతా అన్న సందేహాలను నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: