మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ యొక్క రాజీనామా జనసేన పార్టీ సభ్యులకు మరియు పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎటువంటి హడావుడీ లేకుండా మరియు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా జెడి రాజీనామా చేయడం అనేది అందరిలో విపరీతమైన ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇకపోతే పవన్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాను అని చెప్పి మళ్ళీ సినిమాల వైపు అడుగు పెట్టడం తన రాజీనామాకు కారణమని లక్ష్మీ నారాయణ చెప్పడం కూడా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడు ఇలాంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ను ఈమధ్య పాస్ చేసింది లేదు.

 

ఇకపోతే జెడి ఇలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్న తర్వాత పవన్ అతని రాజీనామాపై ఎలా స్పందిస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. జెడి రాజీనామా వచ్చిన కొద్దిసేపటికే పవన్ కూడా తాను లక్ష్మీనారాయణ యొక్క రాజీనామాను నేణు గౌరవిస్తున్నాను చెప్పి తర్వాత ఆయన రాజీనామాకు చెప్పిన కారణం గురించి స్పందించారు. తనకేమీ సిమెంటు ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనుల ఫ్యాక్టరీ లాంటివి లేవని.. అతను అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏమీ కాదని చెప్పిన పవన్ తనకు తెలిసినదల్లా సినిమా ఒక్కటే అని అన్నారు.

 

తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి అని.... మరియు వారి శ్రేయస్సు కోసం పార్టీ ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్ప మరో దారి తనకు కనపడలేదని అన్న పవన్, ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేది అని కూడా అన్నారు. పవన్ అన్న మాటల్లో నిజం ఎంతైనా ఉంది. కానీ జెడి కూడా మాటకు కట్టుబడే వ్యక్తి కావడం.... పవన్ ఇంతకు ముందు మళ్ళీ సినిమాలు చేయనని తెగేసి చెప్పడం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే. తాను రాజీనామా చేసే ముందు పవన్ తో ఒకసారి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఇటువంటి సంచలనం జరిగేది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: