ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అపర చాణక్యుడు అన్న పేరు క్రమేపీ పోతోంది. వయసు పైబడ్డాక మనిషికి ఎలా చూపు మందగిస్తుందో అలాగే ఆయనకు కూడా బుద్ధి మందగించింది అని జనాలు అంటున్నారు. చంద్రబాబునాయుడు హయాంలోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలు ఊచలు లెక్కపెట్టాడు. అక్రమాస్తుల కేసులో తనపై ఎన్నో సెక్షన్లు విధించి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ లాంటి సాలిడ్ వ్యక్తి అండతో చంద్రబాబు జగన్ పై కుట్రపన్నారని అంతా అప్పట్లో అనుకున్నారు.

 

ఇకపోతే అప్పటినుండి ఇప్పటివరకు చంద్రబాబు వీలు చిక్కినప్పుడల్లా లక్ష్మీనారాయణ మరియు పవన్ కళ్యాణ్ యొక్క జనసేన ను తెగ పొగిడేస్తున్నారు. పవన్ పార్టీ పైన తన రాజకీయ లబ్దికోసం సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉన్న చంద్రబాబు... లక్ష్మీనారాయణ విషయానికి  వస్తే అతను ఒక పెద్ద హీరో అంటూ విపరీతంగా పొగిడాడు. కట్ చేస్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓడిపోవడం మరియు బిజెపితో కీలకమైన పొత్తు పెట్టుకున్న తర్వాత అతను పార్టీకి రాజీనామా చేయటం వెంటవెంటనే జరిగిపోయాయి.

 

గతంలో కూడా చంద్రబాబు నాయుడు హీరోలు అన్న ప్రతి ఒక్కరూ క్రమంగా జీరోలు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని కూడా చంద్రబాబు నాయుడు గతంలో బాగా వెనకేసుకుని వచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మనకు తెలియనిది కాదు. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట కూడా అని చంద్రబాబు దెబ్బకి చివరికి ఎన్నికల్లో గతి ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ ఒక చిన్న పిల్లాడి కారణం చెప్పి పవన్ ను ఊబి లోనికి నెట్టేశాడు. ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా బాబు కంట్లో పడకూడదు బాబోయ్ అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: