టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత కొంత మంది మంచి ప‌నుల‌కు వాడుతుంటే... మ‌రికొంత మంది వాటితో అరాచ‌కాలు చేస్తున్నారు. లికాంటో అంటూ ఓ వెబ్‌సైట్  మెల్ ఓపెన్ చేసి కొంద‌రు ఆక‌తాయిలు ఎస్క‌ర్ దందాని మొద‌లుపెట్టారు. అమ్మాయిల‌కు ఎస్కార్ చేయాలంటూ లొకాంటో వెబ్‌సైట్‌లో అమ్మాయిలు అబ్బాయిల పేర్ల‌తో ప్ర‌క‌ట‌న ఇస్తున్నారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల్లో ఉన్న నెంబర్లు తీసుకుని కాంటాక్ట్స్‌కి క‌నెక్ట్ అవుతున్నాడు యువ‌తి యువ‌కులు. అంద‌మైన అమ్మాయిల పేరుతో పెట్టి మేం ఏం కోరితే అది చేయాలంటూ ఆశ చూపిస్తున్నారు. లొకాంటోలో ఉన్న నెంబ‌ర్ల‌కు కాల్ చేసి అబ్బాయిలు డ‌బ్బులు వ‌దిలించుకుంటున్నారు. 

 

ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి హైద‌రాబాద్లో నివాస‌ముంటున్న దుర్గాప్ర‌సాద్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఈ దందాలో 1200 మంది యువ‌తీ యువ‌కుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. అంద‌మైన అమ్మాయిల‌తో గ‌డేపేందుకు అవ‌కాశం అంటూ దుర్గాప్ర‌సాద్ ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. ఒకొక్క‌రి నుంచి 20, నుంచి 30 వేలు వ‌సూలుచేశాడు ఆఉర్ద‌గ‌ప్ర‌సాద్‌. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌డంతో దుర్గాప్ర‌సాద్‌ను అరెస్ట్ చేశారు ఎసిపి ప్ర‌సాద్. ఇక ఆయ‌న చెప్పిన వివ‌రాలిలా ఉన్నాయి.... అమ్మాయిల ఫొటోల‌ను ఎర‌గా వేసి డ‌బ్బులు గుంజుతున్నారు కేటుగాళ్ళు. లొకాంటో వెబ్‌సైట్ ద్వారా మ‌ళ్ళీ డ‌బ్బులు దోచుకునే కేటుగాళ్ళు రంగంలోకి దిగారు. క‌వాడిగూడా లో ఉంటున్న 22ఏళ్ళ అబ్బాయి కంప్ల‌యింట్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ కంప్ల‌యింట్ లో మెయిన్ ఎస్‌కార్ట్స్ జాబ్స్‌ అని కాంటాక్ట్స్ పెట్ట‌గా అత‌డు కాల్ చేశాడు. అవును మా ద‌గ్గ‌ర ఆ జాబ్స్ ఉన్నాయంటూ స‌మాధానం చెప్పారు. బ్యూటిఫుల్ లేడీస్‌కి ఎస్‌కార్ట్‌గా ప‌నిచేయాలి. 25,000 శాల‌రీ అంటూ బెండ్ చేస్తున్నారు. స‌రే చేస్తాన‌ని సిద్ధ‌మైన ఆ యువ‌కుడు ఆ పని చేస్తాన‌ని ఒప్పుకున్నాడు దాంతో అత‌ను అంద‌రికి ఫోన్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. 

 

ఇక నీకొక కారు పంపిస్తాను ఆ కారులో ఎక్కు వాళ్ళు నిన్ను తీసుకువెళ‌తార‌ని చెప్ప‌గా.. అలాగే కారు బుక్ చెయ్య‌డానికి ఒక నాలుగు వేలు క‌ట్టాలి అన్నారు. స‌రేఅని ఇంకో 4000 వేయ‌గానే కారు వ‌చ్చింది. కారులో కూర్చోగానే ఒక మెసేజ్ వ‌చ్చింది. నేను మ‌మ‌తాని నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేట‌ప్పుడు కొన్ని కిట్ ఐటెమ్స్ కావాలి అని మెసేజ్ పెట్టారు. నా బాడీకి ప‌ర్‌ఫ్యూమ్స్ కూడా కావాలంటూ ఒక లిస్ట్ పింపించింది.  ఇత‌ను మొద‌టి ప‌ర్స‌న్కి కాల్ చేసిన నాకు మెసేజ్ అయితే వ‌చ్చింది కానీ చాలా లిస్ట్ పెట్టింది ఏవో ఐటెమ్స్ కావాలంటూ ఏం చేయాలి అని అడ‌గ‌గా..స‌రే ఒక‌ప‌ని చేయి నువు అవ‌న్నీ తీసుకురావ‌డం చాలా క‌ష్టం. అవి చాలా కాస్ట్ ఉంటాయి కాబ‌ట్టి నేను తీసుకువ‌స్తా నాకు ఒక ప‌ది వేలు ఎకౌంట్‌లో వేయ‌మ‌ని మ‌ళ్ళీ అడిగాడు.. అత‌ను నా ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేదంటూ 9వేలు మాత్ర‌మేళ‌వేశాడు. కారువాడు దించేసి వెళ్ళిపోగానే అప్పుడు అత‌నికి అర్ధ‌మ‌యింది ఇదంతా చీటింగ్ అని వెంట‌నే మమ్మ‌ల్ని సంప్ర‌దించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దుర్గాప్ర‌సాద్‌ను అదుపులో తీసుకుని విచారించ‌డం జ‌రిగింది. ఈ విచార‌ణ‌లో తెలిసిన నిజ నిజాలు వింటే షాకే... ఇలా ఫేక్ ఐడీ ల‌ను క్రియేట్ చేసుకుని ఈయ‌నే ఇలా మెసేజ్స్ పంప‌డం జ‌రుగుతుంది. ముందు ఎట్రాక్ట్ చేయ‌డం కోసం డిపిలో లేడీస్ పొటోస్ కొన్ని ప‌ర్మ‌నెంట్‌గా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. దానికి యూత్ ఎట్రాక్ట్ అయి ఎంత ప‌డితే అంత పే చేసేస్తున్నారు. లొకాంటో అనేది ఓ డేటింగ్ వెబ్ సైట్ అని చెప్ప‌వ‌చ్చు. లొకాంటోలో క్రైమ్ చేయ‌డానికి త‌ప్ప రియాలిటీ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. యూత్ ఎట్రాక్ట్ అవ్వ‌కుండా జాగ్ర‌త్లు వ‌హించాలి. ఇందులో ఎవ్రీథింగ్ ఫేక్ అని చెప్ప‌వ‌చ్చు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: