జనసేన పార్టీకి రాజీనామా చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెలిబుచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తూ , ఆయన చేసిన రాజీనామా ను ఆమోదిస్తున్నట్లుగా   పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . తనకు సిమెంట్ ఫ్యాక్టరీ లు , పవర్ ప్రాజెక్టులు , గనులు , పాల  ఫ్యాక్టరీలు లేవని , అధికవేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని పవన్ పరోక్షంగా జగన్ , చంద్రబాబు , జేడీ పై విమర్శలు గుప్పించారు .

 

ఇక తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని , తనపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయన్న ఆయన , వారి కోసం , తన కుటుంబం కోసం , పార్టీ ఆర్ధికపరిపుష్ఠి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరని పవన్ వెల్లడించారు . ఈ విషయాలన్నీ  జేడీ కి తెలుసునని , తన రాజీనామా లేఖలో ఆ విషయాలన్నీ  ప్రస్తావించి ఉంటే  బాగుండేదని పవన్ కళ్యాణ్ అన్నారు . జనసేన కు జేడీ  రాజీనామా చేసినప్పటికీ తనకు , జనసైనికులకు ఆయనపై ఉండే గౌరవం ఎప్పటికి  అలాగే ఉంటుందని చెప్పారు . ఇక జనసేన కు రాజీనామా చేసిన జేడీ , పవన్ కు లేఖాస్త్రం సంధించిన విషయం తెల్సిందే . పవన్ లో నిలకడైన విధివిధానాలు లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు .

 

ఇక తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితమని , ఇకపై సినిమాల్లో నటించానని గతం లో పలుమార్లు పవన్  పేర్కొన్న విషయాన్ని  ఈ సందర్బంగా  జేడీ గుర్తు చేశారు . ఇప్పుడు మళ్ళీ  సినిమాల్లో నటించాలని మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా , మీలో  నిలకడైన విధి, విధానాలు లేవని స్పష్టం అవుతోందని , అందుకే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లుగా జేడీ  ప్రకటించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: