2012 డిసెంబర్ లో నిర్భయపై అత్యాచారం చేసిన దోషులకు  ఉరిశిక్ష విధించి చాలా కాలం అయ్యింది.  అమలు చేయడానికి మాత్రం ఎన్నో సంవత్సరాలు పట్టింది.  ఫిబ్రవరి 1 వ తేదీన ఉరి శిక్ష విధించేందుకు రెడీ అయ్యింది.  ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష విధిస్తున్నారు.  ఉరి నుంచి తప్పించుకోవడానికి వీరు శతవిధాలా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.  నలుగురు దోషులకు రేపు ఉరవేయబోతున్నారు.

 
ఇక ఇదిలా ఉంటె, నలుగురికి ఉరివేసేందుకు పవన్ ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు.  తీహార్ జైల్లో పవన్ ఉరికి సంబంధించిన ట్రయిల్ రన్ ను కూడా నిర్వహించారు.  ఇకపోతే,తెలంగాణ లో సమత కేసులు ముగ్గురు దోషులకు కూడా ఉరిశిక్షను విధించింది ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్.  అయితే, ఈ  ఉరి ఎప్పుడు వేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  నిర్భయ కేసులో నిందితులకు మళ్లే వీరికి కూడా ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉన్నది.

 
కోర్టు ఉరిశిక్షను విధించిన తరువాత ఆ ఉరిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.  కోర్టు నుంచి డెత్ వారెంట్ ను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.  దోషులు చట్టాలను అడ్డం పెట్టుకొని ఊరినుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ జీవిత కాలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.  ఎందుకంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అది విచారణకు రావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది.  


అందుకే వీటిని అడ్డం పెట్టుకొని జీవన కాలాన్ని పెంచుకుంటూ ఉంటారు.  అందుకోసమే ప్రభుత్వం అన్నింటిని సమూలంగా మార్పులు చేయాలనీ చూస్తున్నది.  మరణశిక్ష పడిన వ్యక్తి కింది కోర్టుల్లో కాకుండా పిటిటిషన్ దాఖలు చేయాలంటే డైరెక్ట్ గా సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లాలని అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని చట్టాలను మార్చే అవకాశం ఉన్నది.  ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో తెలియదు.  కోర్టు సమత కేసులో ఉరిశిక్ష విధించింది.  అమలు ఎప్పుడు చేస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: