జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజీనామాపై జనసేన పార్టీ అధినేత పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ నారాయణ రాజీనామాను ఆమోదించిన తరువాత  రాజీనామా గురించి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ నారాయణ యొక్క భావాలను తాను గౌరవిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తన దగ్గర ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని అందువలనే సినిమాలు చేస్తున్నానంటూ స్పష్టత ఇచ్చారు. 
 
ఈ విషయాల గురించి లక్ష్మీ నారాయణ తెలుసుకొని ఉంటే బాగుండేదంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేయడం మాత్రమే తెలుసని భారీ స్థాయిలో వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని తాను కానని పవన్ కళ్యాణ్ అన్నారు. తనపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని జనసేన పార్టీకి ఆర్థిక పుష్టి కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు సినిమాలు చేస్తున్నానని పవన్ చెప్పారు. 
 
లక్ష్మీనారాయణ ఈ విషయాల గురించి తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే మాత్రం ఎంతో బాగుండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ లక్ష్మీ నారాయణపై తనకు, జనసైనికులకు గౌరవం ఎప్పటికీ ఉంటుందని పవన్ అన్నారు. జనసేన పార్టీకి ఆర్థిక పుష్టి కొరకు తాను సినిమాలు చేయడం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఒకవైపు రాజీనామాను ఆమోదిస్తూనే పవన్ కళ్యాణ్ లక్ష్మీ నారాయణ రాజీనామాపై సెటైర్లు, పంచులు పేల్చారు. మరి పవన్ చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీ నారాయణ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన తరువాత పవన్ గతంలో సినిమాలకు, నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని చెప్పారని కానీ పవన్ మరలా సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ లో నిలకడైన విధివిధానాలు లేకపోవడం వలనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని లక్ష్మీనారాయణ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: