ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజానీకానికి మొత్తం భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచి భారీ మొత్తంలో ప్రజలపై భారం పడేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత మద్యం ధరలు పెంచి సామాన్య ప్రజలకు మద్యాన్ని కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇక ఇప్పుడు మరిన్ని ఛార్జీలు పెంచి ప్రభుత్వానికి ఆదాయం పెంచే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... చార్జీలు పెంచుతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇప్పటికీ ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ తో ప్రభుత్వానికి రాబడి పూర్తిగా తగ్గిపోవడంతో... ప్రభుత్వం కూడా చార్జీలు పెంచక తప్పటం  లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

 

 

 అయితే ఇప్పటికే ఆర్టీసీ, మద్యం ధరలు పెరిగగా... ఇప్పుడు చార్జీలు పెరిగే వాటిలో ప్రధానంగా నాలుగు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది విద్యుత్ ఛార్జీలు... గతంలో విద్యుత్ చార్జీలను  తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితుల దృశ్య ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కారణంగా... విద్యుత్ను ఉత్పత్తి చేసే డిస్కంలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో కనీసం 50 శాతం మేర నైనా నష్టాలను తగ్గించేందుకు... విద్యుత్ చార్జీలు పెంచింది కేసీఆర్ సర్కార్. ఈ చార్జీల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల ఆదాయం చేకూరింది. ఇక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా భారీగా పెరిగిన పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2012 సంవత్సరం నుంచి రాష్ట్రంలో భూముల ధరలు రివైస్ కాలేదు.

 

 

 దీంతో ఒక్కసారిగా భూముల రిజిస్ట్రేషన్ లపై చార్జీల పెంపు భారీగానే ఉండబోతున్నట్లు  రెవిన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా  రెవెన్యూ ఛార్జీల పెంపు వల్ల ప్రభుత్వానికి 2500 నుంచి 3 వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.ఇక  వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెంచే యోచనలో కెసిఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలు విక్రయ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసేలా కొత్త పద్ధతిని ప్రభుత్వం తీసుకువచ్చి వాహనదారులకు మెరుగైన సేవలు కల్పిస్తున్నప్పటికి.. భారీగా ఛార్జీలు కూడా పెంచుతుంది. ఛార్జీల పెంపు ద్వారా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రాపర్టీ టాక్స్ కూడా పెంచుతుంది. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు లో... పారిశుద్ధ్య పనుల కోసం అధిక నిధులు కేటాయిస్తుందని ప్రాపర్టీ టాక్స్ పెంచేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ టాక్స్ పెంపుతో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రానుంది. కాగా ఈ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజల పై పది వేల నుండి 12 వేల కోట్ల భారం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: