రెండు పడవలపై కాళ్ళు పెట్టడం అంత మంచిది కాదు.  పూర్వం మన పెద్దలు చెప్పిన సామెత ఇది.  దీనిని ఇప్పటికే పవన్ లాంటి వ్యక్తులు ఫాలో అవుతూనే ఉన్నారు.  ఏమి తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు అనుకుంటే సరే తెలియదు కదా అనుకోవచ్చు.  కానీ, తనకు అన్ని తెలుసు అని చెప్పే పవన్ కూడా ఇలా తప్పులో కాలు వేయడం ఎంతవరకు సమంజసం అర్ధం కావడం లేదు.  ఎన్నికల సమయంలో తన చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటానని చెప్పిన పవన్, ఇప్పుడు సినిమాలు చేయడంతో ప్రజలే కాదు నాయకులు కూడా ఆయన్ను తేలిగ్గా తీసుకుంటున్నారు.  


రేపటి రోజున ఆయన జనాల్లోకి వెళ్లి ఎలా ఓట్లు అడగగలుగుతారు.  సినిమా వాళ్ళు అంతే... సినిమాలు చేసుకోవడనికి మాత్రమే పనికొస్తారు.  అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు అనే బలమైన మాట జనాల్లో ఉన్నది.  అందుకే రాజకీయాల్లో తమను ఎంత తొక్కినా రాజకీయనాయకులకు మాత్రమే ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పించి సినిమా రంగం నుంచి రాజకీయాల్లో నిలబడితే మాత్రం పట్టించుకోవడం లేదు.  


దీనికి సరైన ఉదాహరణ అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్.  చిరంజీవి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు.  రాజకీయాల్లో ఉన్నన్ని రోజులో సినిమాలు పట్టించుకోలేదు.  ఎమ్మెల్యేగా గెలిచారు.  అయితే, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పెద్ద దెబ్బ పడింది.  అలా కాకుండా పార్టీని అలానే ఉంచి నడిపించితే మెగాస్టార్ ఈరోజున మరోలా ఉండేవారు.  అదే తప్పును ఇప్పుడు పవన్ చేస్తున్నారు.  చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పిన పవన్, ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకు ఇలా సినిమాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  


తమ జీవితాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీలో చేరిన వ్యక్తులు అధినాయకుడు పవన్ అనుసరిస్తున్న విధానాలను చూసి షాక్ అవుతున్నారు.  షాక్ కావడమే ఇంకా ఆ పార్టీలోనే ఉంటె మనుగడ సాధ్యం కాదని తెలుసుకున్న నేతలు అక్కడి నుంచి మెల్లిగా బయటకు వచ్చేస్తున్నారు.  పవన్ పార్టీకి రామ్ రామ్ అంటున్నారు.  జెడి వెళ్లిపోయారు.  ఆ బాటలోనే ఇంకొందరు కూడా రెడీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: