బడ్జెట్.. రేపు విడుదల అవుతుంది. ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బడ్జెట్ ఇప్పటికే సిద్ధం అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు నిర్మల సీతారామన్ బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈసారి అయినా మధ్య తరగతి ప్రజలు మహారాజులు అవుతారు ఏమో అనే ఆలోచనలు వస్తున్నాయి. 

 

అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర బ‌డ్జెట్‌పై వివిధ వ‌ర్గాల‌కు అనేక ఆశ‌లు ఉన్న‌ట్టే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుడికి కూడా అనేక ఆశ‌లు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డంతో పాటు రుణాల సౌల‌భ్యం పెర‌గాల‌ని భావిస్తాడు. అదే సమయంలో రియ‌ల్ ఎస్టేట్ భూమి కోరుకుంటాడు. పన్నులు త‌గ్గాల‌ని.. తాము కొనే వ‌స్తువుల రేట్లు తగ్గాల‌ని కోరుకుంటాడు.

 

మరి మధ్య తరగతి వారు కోరుకుంటున్నట్టు ఏ ఒక్కటి అయినా జరుగుతాయా? లేక ఆశలు అడియాశలేనా? అసలు నిర్మలమ్మ తెచ్చే బడ్జెట్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు దేశం ఆర్థికమాంద్యంలో ఉంది. అలాంటిది ఈ బడ్జెట్ లో మధ్యతరగతి వారి గురించి అసలు ఆలోచించారా? 

 

నిజానికి మనం అందరం కోరుకుంటాం.. బడ్జెట్ మధ్యతరగతి వారికీ మంచి జరగాలని.. రుణాలు తగ్గుక వడ్డీకి రావాలని.. అలాగే రియల్ ఎస్టేట్ భూమి ధర తగ్గితే కొనాలని.. మరి అసలు రేపు నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు ఎంత న్యాయం చెయ్యనున్నారు. అసలు ఈ మధ్యతరగతి వారికీ ఎలాంటి ఊర‌ట ల‌భిస్తుందో చూడాలి. 

 

ఈ బడ్జెట్ 2020 పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఒకప్పుడు బడ్జెట్ అంటే కేవలం ఏ నాలుగు కుటంబంలోనో ఏ ఒక్కరో ఉంటారు.. కానీ ఇక్కడ ఇప్పుడు ఆలా కాదు.. ఫేసుబుక్, వాట్సాప్ ఉన్న అందరికి ఈ బడ్జెట్ గురించి తెలుస్తుంది. అందుకే ఈ బడ్జెట్ ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మరి ఈ బడ్జెట్ ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: