ఓ క్యాబ్ డ్రైవర్ అదృశ్యమయ్యాడు... ఎన్ని చోట్ల గాలించినా ఫలితం లేకుండా పోయింది... దీంతో ఎంత గాలించినా ప్రయోజనం లేదు అని అనుకున్నా కుటుంబీకులు... సదరు వ్యక్తి కనిపించడం లేదు అంటూ పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించి సదరు వ్యక్తిని పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... కుటుంబ సమస్యలతో అదృశ్యమైన క్యాబ్ డ్రైవర్ కేసును పోలీసులు చేధించారు. దాదాపు తొమ్మిది నెలల సమయం తర్వాత క్యాబ్ డ్రైవర్లను పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

 

 

పంజాగుట్టలోని జయ అపార్ట్మెంట్స్ లో నివాసముండే ఆలీ మసున్ భక్షి  క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భార్య కుటుంబంతో కలిసి పంజాగుట్ట లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే పలు కుటుంబ సమస్యలతో అలీ మాసూన్ భక్షి  సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే 2019లో ఏప్రిల్ నెలలో 18వ తేదీన కాచిగూడ లోని మహారాజ హోటల్ లో భార్యకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండడంతో అక్కడ దింపి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు ఆ వ్యక్తి. ఇక ఇంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య కుటుంబ సభ్యులు... ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో... మే 14న కాచిగూడ పోలీస్ స్టేషన్ లో అలీ మసూన్ భక్షి  కనిపించడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు. 

 

 

 ఇక మాసూన్ భక్షి  భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు  పోలీసులు. ఇక పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి...అలీ  మసూన్ భక్షి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు తొమ్మిది నెలల పాటు అలీ మాసూన్ భక్షి  ఆచూకీ కోసం గాలించారు పోలీసులు. ఇక తాజాగా గురువారం అలీ మసూన్ భక్షి ... అత్తాపూర్లో ఆచూకీ గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని పోలీస్  స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తొమ్మిది నెలల తర్వాత అలి  మసూన్ భక్షి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: