ఈనాటి ప్రపంచంలో డబ్బు గురించి ఆలోచించని వ్యక్తి ఉండడు. దీనితో డబ్బు ఎలా సంపాదించాలి అన్న విషయం పై అనేకమంది తమ ఆలోచనలను పుస్తకాలుగా మార్చి కొన్ని లక్షల కాపీలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోవడంతో ఆ పుస్తకాలను వ్రాసిన వారు కూడ కోటీశ్వర్లుగా మారిపోయారు.

అలాంటి వారిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు ఉన్న ‘ది కరేజ్ టు బి రిచ్’ పుస్తకాన్ని వ్రాసి ప్రపంచ స్థాయి మనీ ఎక్స్ పర్ట్ గా మారిపోయిన సూజీ ఆర్మన్ డబ్బు గురించి చెప్పిన మాటలు అందరూ గుర్తు పెట్టుకోవలసిన మాటలు. ‘డబ్బు మీపై అధికారాన్ని చెలాయించే బదులు మీరు డబ్బు పై అధికారాన్ని చెలాయించినప్పుడు మాత్రమే ధనవంతులు కాగలుగుతారు’ అంటూ అభిప్రాయ పడ్డాడు.

మనలో చాలామంది డబ్బు ఉండకపోవడానికి గల కారణం డబ్బు పట్ల మనకు ఉన్న అభిప్రాయాలు ఆలోచనలు మాత్రమే అని సూజీ ఆర్మన్ అభిప్రాయం. అంతేకాదు ఒక వ్యక్తికి ఉన్న దరిద్రపు ఆలోచనలు అతడిని పేదవాడుగా చేస్తాయని అందువల్ల మన ఆలోచనల విషయంలో కూడ నియంత్రణ ఉంటేనే ఏవ్యక్తి అయినా ధనవంతుడుగా మారుతాడని ఈ రచయిత అభిప్రాయం.

అంతేకాదు పొడుపు చేసే అలవాటు ఉన్నవాళ్ళు అంతా ధనవంతులు కాలేరు అనీ  ఆ పొదుపును తెలివిగా పెట్టుబడిగా మార్చగలిగినప్పుడే ఐశ్వర్యం వస్తుందని ఆర్మన్ అభిప్రాయ పడుతున్నాడు. ప్రకృతి శక్తి లాగే డబ్బు కూడ ఒక శక్తి అన్న విషయం గ్రహించి ఆ శక్తిని లోబరుచుకోవడానికి సరైన కార్య సాధనను ఎంచుకున్న వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలగుతాడు. ఇలా ఎన్నో డబ్బు సంపాదన గురించి ఎన్నో మార్గాలను తెలియ చేసిన ప్రముఖ మనీ రచయిత సూజీ ఆర్మన్ అనేక వ్యాపారాలు చేసి అనేక పరాజయాలు ఎదుర్కున్నాడు. ఆ పరాజయాల అనుభవాలనే మాటలుగా మార్చి పుస్తకాలు  వ్రాసి  అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో కేవలం తన పుస్తకాల అమ్మకాలతో ఎదిగాడు అన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పడాలసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: