రాజధాని కమిటీల విషయంలో టీడీపీ రాంగ్ ట్రాక్ లో వెళ్లిందా ? కమిటీలను వాటి రిపోర్టులను తీవ్రంగా తప్పు పట్టిన ప్రతిపక్షం ఇప్పుడు వాటినే ఎందుకు ప్రస్తావిస్తోంది  ? ప్రభుత్వం చెప్పిందే కమిటీలు రాశాయన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాటినే తెరపైకి తెస్తోంది. జిఎన్ రావు కమిటీ విషయంలో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా ?

 

రాష్ట్ర సమగ్రాభివృద్ది, పాలనా వికేంద్రీకరణపై కమిటీల నివేదికలను టీడీపీ తీవ్రంగా తప్పు పట్టింది. నివేదికలు కూడా రాకముందే..... ప్రభుత్వం వ్యవహారం నడిపిందని ఆరోపించింది. సిఎం చెప్పిందే కమిటీలు తమ నివేదికలో ఇచ్చాయని....వాటికి విశ్వసనీయత లేదని...ఆ నివేదికలు చెత్త బుట్టలో వెయ్యాలని చంద్రబాబు పిలపునిచ్చారు. స్వయంగా బోగి మంటల్లో కమిటీ నివేదిలు వేసి నిరసనల తెలిపారు. కమిటీ పర్యటనలు చెయ్యలేదని....కేవలం మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వం చెప్పిందే నివేదికగా ఇచ్చారని ప్రతిపక్షం పోరాటం చేసింది.

 

ఇదిలా ఉంటే ఇప్పడు మళ్లీ కమిటీ అంశం తెరపైకి వచ్చింది.   విశాఖపై ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం దాచి పెట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. విశాఖలో ఉన్న అననుకూలతలను పైకి చెప్పకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపిస్తోంది. మొన్నటి వరకు కమిటీ నివేదికలు తప్పన్న ప్రతిపక్షం...ఇప్పుడు అవే నివేదికలను ప్రస్తావిస్తోంది. వైజాగ్ కు అన్యాయం చేసేలా...పెట్టుబుడులు పెట్టేవారు వెనక్కి వెళ్లేలా నివేదికలు ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది. అసలు కమిటీ ఏర్పాటుకే చట్టబద్దత లేదంటూ నివేదికలను తప్పు పట్టిన ప్రతిపక్షం...ఇప్పుడు అదే నివేదికలో అంశాలను తెరపైకి తెచ్చి ప్రశ్నిస్తోంది.

 

ప్రతిపక్షం విమర్శలను అధికార పక్షం తీవ్రంగా తప్పు పడుతోంది. టిడిపికి ఒక విధానం లేదని విమర్శించారు. దీంతో టిడిపి డిఫెన్స్ లో పడే పరిస్థితికి వచ్చింది. వాస్తవంగా కమిటీ నివేదిక పూర్తిగా మొదట్లో బయటకు రాలేదు. వేరే మార్గాల ద్వారా టిడిపి ఆ నివేదిక తెప్పించుకుంది. మరోవైపు వాటిపై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. దీంతో మొత్తం నివేదికను చూసిన టిడిపి...అందులో వైజాగ్ కు వ్యతిరేకంగా ఉన్న అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.

 

 ముగిసిన అంశాన్ని టచ్ చెయ్యడం ద్వారా....తాము సెల్ప్ గోల్ వేసుకున్నట్లు ఉంటుందని టీడీపీ నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు. కమిటీ కి విశ్వసనీయత లేదని, అది అధికార పక్షం ఇచ్చిన నివేదిక అని చెప్పిన టీడీపీ నేతలు... తమ వాదనకే కట్టుబడి ఉంటే బాగుండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద..టిడిపి నేతలు.. కమిటీ పేరు ప్రస్తావించడంతో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరకున పెట్టేలా విమర్శలకు దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: