సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్​ స్పందన

గతేడాది ఆంధ్రప్రదేశ్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరిన  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆంధ్రలో ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ విజయం సాధించి సీఎం అవుతారని ప్రకటించారు కూడా. కానీ వైఎస్​ జగన్​మోహన్​ ప్రభంజనానికి జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవడం తెలిసిందే.  దాదాసే దాదాపు తొమ్మిది నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని  ఈయన రాజీనామాతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.   

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్నామని తెలుపుతూ జనసేన అధికారిక ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. “వి.వి.లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాం. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు ఇతరత్రా లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే గవర్నమెంట్​ ఎంప్లాయినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి.

 

 వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ  లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు’’ అని పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఒక పెద్ద ఆఫీసర్​ జనసేనలో చేరడంతో గతేడాది ఒక ఊపు మీదున్న జన సైనికులు లక్ష్మీనారాయణ రాజీనామాతో కొంత నిరాశ చెందుతున్నట్టు సమాచారం. పవన్​ కల్యాణ్​ నిలకడ లేని ఆలోచనల వల్లే  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: