రాజకీయాన్ని ఊసరవెల్లిలా పోల్చడంలో తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే అవసరాలకోసం ఎప్పుడు ఏదో ఒక రంగు మారుస్తూ ఉంటుంది ఊసరవెళ్లి, అలాగే ప్రజలకోసం అని చెప్పుకునే నాయకులు కూడా ఎప్పుడూ ఏదో ఒక రంగు మార్చుకుంటు ఉంటారు. ఇక రాజకీయాల్లో జరిగే చిత్రాలను వర్ణించాలంటే అదొక అంతర్జాతీయ సమస్యలా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరి పదవి శాశ్వతం కాదు. అంతా భ్రమ, ఆ విషయం తెలిసినా రాజకీయ నాయకులు జలగల్లా మారి పదవుల కోసం ప్రాకులాడుతారు.

 

 

ఇకపోతే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలను పరిశీలిస్తే, ఏపీలో శాసనమండలి రద్దుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారా లేదా అన్న చర్చ నిన్న మొన్నటి వరకు జరుగింది. కానీ తాజాగా శాసనమండలి అధికారికంగా రద్దు కాకముందే మోపిదేవి మంత్రిత్వ శాఖలకు ప్రభుత్వం కోత పెట్టింది. ఇప్పటిదాక మోపిదేవి వద్ద ఉన్న మార్కెటింగ్‌ శాఖను వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న కన్నబాబుకు అప్పగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

అలాగే పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్ద ఉన్న ఫుడ్‌ప్రాసెసింగ్‌ బాధ్యతలను కూడా మంత్రి కన్నబాబుకే అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే వీరి పనితీరుపై గత కొంతకాలంగా అంసంతృప్తితో ఉన్న జగన్ ఈ ఇద్దరు తాను అనుకున్న స్దాయిలో పెర్పామెన్స్చేయకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది... ఇదే సమయంలో క‌న్న‌బాబుపై బాగా గురి కుద‌ర‌డంతోనే మోపిదేవి, గౌత‌మ్‌ వద్ద ఉన్న శాఖ‌ల‌ను జ‌గ‌న్ మార్చిన‌ట్టు ప్ర‌చారం జరుగుతుంది.

 

 

ఇకపోతే  ఇటీవల ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద ఉంది. కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్‌కు పంపనుంది. అక్కడ ఆమోదం లభిస్తే.. శాసనమండలి రద్దవుతుంది. అప్పుడు ఎమ్మెల్సీలంతా మాజీలవుతారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: