కేంద్రం ప్రతి ఏటా బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఏటా ఎంతో ఆశగా ఎదురు చూడడం.. ప్రవేశపెట్టిన తర్వాత నిరాశ చెందటం సాధారణ విషయమైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాలని ఆశిస్తున్నా.. అవి రాకపోయేసరికి హామీలు కలలుగా మిగిలిపోతున్నాయి. ఇందులో కీలకమైన విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కేంద్రం నుండి నిధులు రాక ఎన్నో సంవత్సరాలుగా పూర్తి కాకుండా మిగిలిపోయింది. అయితే విజయవాడలోని మరో ఫ్లైఓవర్ 'బెంజి సర్కిల్ యొక్క నిర్మాణం డిసెంబర్ 31వ తారీఖున పూర్తయింది. అయితే ప్రస్తుతం జాతీయ రహదారుల సంస్థ ఈ ఫ్లైఓవర్ పై రాకపోకలు అనుమతించేందుకు సన్నాహాలు చేస్తుంది.

 

మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కాలినడకన పై వంతెనను పరిశీలించారు. అయితే మొదటి దశగా ప్రారంభమైన 1450 మీటర్ల పరిధిలోని 82 కోట్ల నిర్మాణం ముగిసింది. రెండవ దశలో జరగనున్న మరో 1450 మీటర్ల పరిధిలోని 110 కోట్ల నిర్మాణం ప్రారంభమవ్వనుంది. అయితే ఈసారి లోక్ సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో జాతీయ రహదారులను అనుసంధానం చేసే ఈ బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ తో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్ కు కేంద్రం నిధులను ప్రకటిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.



మరొక విషయం ఏమిటంటే దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి కొన్ని ఆలయాలు అడ్డు రావడంతో.. వాటిని తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే గత కొన్నేళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుంది. ఇకపోతే, రాజధాని ప్రకటన తర్వాత విజయవాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. సో, విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే విధంగా రాజకీయ నేతలు ఈ రెండు ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. మరి జగన్ సర్కారు పాలనలో ఉన్న ఈసారైనా కేంద్రం నిధులను విడుదల చేస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: