నా దారి రహదారి. దానికి అడ్దుగా ఎవడున్న నాలుగు కాళ్లతో ఎగిరి తంతా అనే డైలాగ్ మీరు ఎక్కడైనా విన్నారా.. వినరు లేండి ఎందుకంటే ఇది అంటున్నది మనిషి కాదు ఆవు. దానికి నాలుగు కాళ్లు ఉంటాయి కదా, అందుకే డైలాగ్‌లో కూడా బలం ఉండాలని నాలుగు పంచులను విసిరింది. ఇకపోతే కోపం మీ మనుషులకేనా, మాకు కూడా ఉంటుందని ఈ పశువు నిరూపించింది.

 

 

ఇలా ఎందుకు చేసిందో ఏమో తెలియదుగాని, మన మనుషులు మాటి మాటికి వాటిని సూటిపోటి మాటలతో అవమానిస్తారు కదా.. ఎలాగంటే పశువులాగ బలిసావు, కాస్త బుద్ధి తెచ్చుకుంటే ఏంటి అని, దున్నపోతులా అలా నిలబడకుంటే ఏదైనా పని చేసుకుని చావచ్చువు కదా అని ఇలా ఒకటేమిటి మనుషులు చేసే ప్రతి తప్పులోను పశువును పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆడిపోసుకుంటారు. పాపం వాటికి కూడా ఇలాంటి మాటలు విని, విని విసుగు వచ్చి ఉంటుంది కావచ్చూ. చెబుతామంటే నోరు లేకపాయో. మరెలా ఎవడైనా బకరా గాడు దొరికితే గాల్లో లేచి ఒక్క తన్ను తన్ని కుమ్మెద్దాం అని ఎన్నాళ్లనుండో కక్ష పెట్టుకున్నట్లుగా ఉందనిపిస్తుంది ఇక్కడ జరిగిన ఈ వీడియో చూస్తే..

 

 

లేకపోతే అతనితో గత జన్మల్లో ఉన్న శత్రుత్వం తాను ఎదురుపడగానే గుర్తుకు వచ్చింది కావచ్చూ, అతన్ని చూడగానే ఆవేశంతో పరిగెట్టి ఒక్క కాన్ బైరి ఇచ్చింది. ఈ వీడియో చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇకపోతే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

 

 

ఇక విషయానికి వస్తే ఒక ఆవుల మంద రోడ్డు దాటుతుండగా చెరొక వైపు రెండు బైకులు అటుగా వచ్చాయి. అక్కడ ఒక బైకర్ని చూసిన ఆ ఆవు ఆవేశంతో కాచుకో నా సామిరంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కాళ్లతో ఎగిరి ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు బైకర్‌ క్రిందపడిపోయాడు. అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలియని స్దితిలో ఉన్న ఆ బైకర్ ఆ ఆవుతో సన్మానం పొందాక అతనికి విషయం అర్ధం అయ్యింది. ఇక అతన్ని తన్నిన ఆ ఆవు తన పని ముగించుకుని మరోవైపు పరుగులు పెట్టింది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: