తెలంగాణలో దిశ సమత అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దిశ కేసులోని నలుగురు నిందితులకు పోలీసులు ఎన్కౌంటర్ చేయగా సమత కేసులో ముగ్గురు నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు 45 రోజుల్లోనే ఉరిశిక్ష విధించింది. అయితే ఈ రెండు అత్యాచారం హత్య ఘటన కేసులను ఛేదించడంలో అధికారులు సక్సెస్ సాధించారు. అయితే దిశ కేసులో దోషులను గుర్తించడానికి సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా ఉపయోగపడ్డాయి.వీటి ఆధారంగానే దిశ కేసులోని నలుగురు నిందితులను గుర్తించగలిగారు పోలీసులు. కానీ  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా... ఎల్లప్పటూర్ లో జరిగిన వివాహిత అత్యాచారం హత్య కేసు పోలీసులకు సవాల్ మారింది . 

 

 

 ఎందుకంటే అత్యాచారం హత్య జరిగిన  ప్రాంతంలో అసలు ఫోన్ సిగ్నల్స్ ఏమీ ఉండవు.. ఇక సీసీటీవీ అయితే మచ్చుకైనా కనిపించవు. చుట్టూరా అటవీ ప్రాంతమే.... దీంతో సమంత అత్యాచారం హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ఆధారాలు కానీ ఆనవాళ్లు కానీ లభించలేదు. ఈ క్రమంలో ఈ కేసును ఛేదించడం పోలీసులకు మరింత సవాల్ గా మారిపోయింది. ఈ కేసు ఛేదన కోసం ఆసిఫాబాద్ డీఎస్పీ కొమరం భీమ్ జిల్లా ఎస్సైలు బృందాలుగా ఏర్పడి... సమత అత్యాచారం హత్య కేసును ఛేదించేందుకు ఎంతో శ్రమించారు. 

 

 

 

 కాగా  సమతా రోడ్డుపై వెళ్తుండగా ఎల్లాపట్టుర్  రామ్ నాయక్ తండ అడవి లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు నిందితులు. ఈ క్రమంలోనే సమత అరుపులు సమీపంలోని పత్తి చేను లో ఉన్న పలువురు కూలీలు విన్నారు.  ఆ తర్వాత సమతను హత్య చేసిన అనంతరం దాహం తీర్చుకోవడానికి కొందరు పొలాల వెల్లగా ... వారి బట్టల పై రక్తపు మరకలు చూసిన కొందరు ప్రత్యక్ష సాక్షులు... ఆ రక్తపు మరకలు కత్తి ఉన్న రక్తపు డిఎన్ఏ తో సరి పోవడం... అంతేకాకుండా సమత డెడ్ బాడీ పై నిందితుల వీర్యం కూడా దొరకడం... ఈ వీర్యాన్ని చెక్ చేయగా నిందితుల వీర్యంతో సరిపోవడం... ఇలా ఎన్నో సంక్లిష్టమైన ఆధారాలతో  పోలీసులు ఈ కేసును ఛేదించారు. కాగా  ఈ కేసులో దోషులు చేసిన పొరపాటే పోలీసులకు దొరికేలా చేసింది. కాగా తాజాగా సమతా ఘట్టనలోని ముగ్గురు నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: