నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా భారతదేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగానుసారం పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం, ఆలగే ఆర్టికల్ 370 రద్దు అనేది ఒక గొప్ప నిర్ణయం. పలు కీలక బిల్లులకు గత సమావేశాలు ఆమోదం తెలిపాయని, వివిధ రంగాల్లో భారత్ విశేష ప్రగతిని సాధించిందని అన్నారు.

 

అలాగే మా ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట తీర్పునిచ్చారని, నన్ కానా షాహిబ్ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని అయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా బీమా అమలు చేస్తున్నామని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత్ మెరుగైన స్థానం సంపాదించిందని, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందని అయన తెలియ చేశారు. దేశంలో కొత్తగా 65 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, గత ఐదేళ్ళలో భారతదేశ వృద్ధి రేటు మెరుగుపడిందని అన్నారు. 

 

ఇంకా జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజలు అన్ని ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నారని. సీఏఏతో బాపూజీ కల నెరవేరిందని అయన తెలిపారు. ముఖ్యంగా మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభం చరిత్రాత్మకం అని ఈ సందర్బంగా తెలిపారు. వ్యాలీలో వివిధ విద్యా సంస్థలను ఏర్పాటు చేయబోతున్నామని అలాగే అయోధ్య తీర్పును ప్రజలంతా స్వాగతించారు. 

 

దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పాలనలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధితో ఎనిమిది కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఇంకా  ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసామని డిజిటల్ ఇండియాతో గ్రామీణ ప్రజలు అనేక విధాలుగా లబ్ధి పొందుతారనని అయన అన్నారు. మేకిన్ ఇండియాతో ఉత్పత్తి రంగం పుంజుకుందని గడిచిన ఆరేళ్లలో రోడ్ కనెక్టివిటీ పెరిగింది అని అన్నారు. అలాగే టూరిజం పైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నామని దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమనని అయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: