రేపటి నుంచి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2020 సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న  బడ్జెట్ వైపు అన్ని రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఈ కేంద్ర బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో కేటాయింపులు ఉంటాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు  ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు... కానీ బిజెపేతర రాష్ట్రాలకు మాత్రమే ప్రస్తుతం చిక్కు వచ్చి పడింది. 

 

 

 ఈ నేపథ్యంలోనే బీజేపీయేతర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడు రాజధానిల అంశం తెరమీదకు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే యోచనలో ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే గడిచిన ఏడాది కేంద్ర బడ్జెట్ లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. అయితే గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఉండడం... చంద్రబాబు వైఖరి కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో... అప్పట్లో కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో  ఏపీ సర్కార్ కు కాస్త అన్యాయం జరిగింది అనే వాదన కూడా ఉంది. 

 

 

 ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం బిజెపి ప్రభుత్వానికి తటస్థంగా ఉన్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి కూడా మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అటు ఏపీ బిజెపి నేతలపై తక్కువ మొత్తంలో విమర్శలు చేయడం లాంటివి... కేంద్ర బడ్జెట్లో ఏపీ సర్కార్ కు కలిసొచ్చే అంశాలే. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుకూలంగానే కేటాయింపులు ఉంటాయా..? న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న తెర మీదికి వస్తుంది..?

మరింత సమాచారం తెలుసుకోండి: