ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విపక్ష  పార్టీలన్ని  తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించాయి. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తోంది కూడా. అయితే దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఏపీ హైకోర్టు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. 

 

 

 తెలుగు మీడియం పూర్తిగా తొలగించడం సరైనది కాదు అంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీరును తప్పుబట్టినది  హైకోర్టు. అంతేకాకుండా ప్రస్తుతం జగన్  సర్కార్ నిర్ణయం పై కర్ణాటక ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపడంతో గమనార్హం . ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కర్నూలు చిత్తూరు జిల్లాలు ఎంతోమంది కన్నడిగులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు అని... జగన్ నిర్ణయం కారణంగా అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. కన్నడిగులు అందరూ కన్నడ మీడియంలో చదువుతున్నారు. అలాంటివారికి జగన్మోహన్ రెడ్డి  తీసుకొచ్చిన... ఇంగ్లీష్ మీడియం వల్ల హక్కులకు భంగం వాటిల్లుతుంది అంటూ  ఆరోపించింది. 

 

 

 ఈ మేరకు కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఏపీ సీఎం కు లేఖ రాశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం కారణంగా... ఇంగ్లీష్ తో  పాటు తెలుగు ఉర్దూ మాత్రమే చదువుతారు. ఈ క్రమంలోనే కన్నడ భాష కనుమరుగైపోతుంది అంటూ ఆరోపించారు . తరతరాల నుంచి రెండు  రాష్ట్రాల మధ్య ఉన్న బంధాలు నాశనమైపోతాయి అంటూ లేఖలో పేర్కొన్నారు కర్ణాటక విద్యా శాఖ మంత్రి. అంతేకాకుండా జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం కారణంగా కన్నడ భాషను  బోధించే టీచర్ల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని.. మైనారిటీ కన్నడ లాంగ్వేజ్ స్కూల్ లన్నింటికీ  కూడా కొనసాగించాలని  కర్ణాటక మంత్రి.. జగన్  సర్కార్ లేఖలో కోరింది. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి  సర్కార్ ఎలా నిర్ణయం తీసుకోబోతున్నదని  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: